ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాపులర్ అయిన మోనాలిసాకు పరిచయం అవసరం లేదు. తిరనాళ్లలో పూసలు అమ్ముకుంటూ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయిన ఈ అమ్మడు అందానికి నెటిజనులు ఫిదా అయ్యిపోయారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్లను మంచి ఫాలోయింగ్ అమ్మడు దక్కించుకుంది. దీంతో మోనాలిసాకు బాలీవుడ్ లో సినిమా అవకాశాలు వచ్చాయని.. టాలీవుడ్ లో కూడా ఛాన్స్ లివ్వడానికి కొంత మంది మేకర్స్ రెడీ అయ్యారంటూ ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే పలు షాప్ ఓపెనింగ్స్, స్పెషల్ ఈ వెంట్స్‌లో సైతం మోనాలిసా పాల్గొంది. ఈ నేపద్యంలో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెను కలవడం.. మూవీ ఛాన్స్ ఇవ్వడం.. ఆమెని హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తానని ప్రకటించాడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా సనోజ్ మిశ్రా హత్యాచారం కేసులో చిక్కుకున్నాడు. ఈ కేసులో పోలీసులు మిశ్రాను అరెస్ట్ చేసారు. ఓ మహిళను లైంగికంగా వేధించడంతో పాటు.. వీడియోలు తీసి బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి మిశ్రాను అరెస్ట్ చేసారు.
ప్రస్తుతం విచారణ చేప్పటిన పోలీసులు ఫిర్యాదు చేసిన మహిళ వివరాలు గోప్యంగా ఉంచారు. సనోజ్ మిశ్రా బాలీవుడ్ లో ఓ పది సినిమాలకు దర్శకత్వం వహించగా.. ఆ యువతిని హీరోయిన్ చేస్తానంటే పలుమార్లు హాత్యాచారం చేశాడని సమాచారం. ఇక బాలీవుడ్‌లో పది సినిమాలు చేసిన మిశ్ర చివరిగా ‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్స సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం ‘కాశీ టూ కశ్మీర్స సినిమాను రూపొందిస్తున్నాడు.