అఖండ 2 VS విశ్వంభర.. బాల‌య్య – చిరు పోటీలో మ‌ళ్లీ కొత్త ట్విస్ట్‌…!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల మధ్యన బాక్సాఫీస్ వార్ మొదలైందంటే చాలు.. తెలుగు ఆడియన్స్‌లో ఫుల్ హైప్ నెలకొంటుంది. ఇప్పటికే వీళ్లిద్దరికీ ఎన్నో సందర్భాల్లో సినిమాలతో ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇస్తూ పలుమార్లు తలపడ్డారు. కొన్నిసార్లు చిరంజీవి సక్సెస్ కాగా.. మరికొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధించారు. ఇక చివరిగా వీళ్ళిద్దరూ 2023 సంక్రాంతి బరిలో వార్‌కు దిగారు. ఈ పోరులో చిరు నటించిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ గా నిలవగా.. వీర సింహారెడ్డి కూడా మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సీనియర్ స్టార్ హీరోస్ మరోసారి బాక్స్ ఆఫీస్ ఫైట్ కు రంగం సిద్ధం చేస్తున్నారు.

Akhanda 2 - Thaandavam': Nandamuri Balakrishna's next with Boyapati Sreenu launched - The Hindu

వ‌రుస‌ సక్సెస్‌లతో దూసుకుపోతున్న బాలయ్య నుంచి అఖండ 2 రానున్న సంగతి తెలిసిందే. బోయపాటి డైరెక్షన్లో తెర‌కెక్కి.. బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన అఖండకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే సినిమాపై మొదటి నుంచి ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ చేస్తామంటూ.. టీం ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే తాజాగా ఇదే డేట్ పై మెగాస్టార్ కూడా మక్కువ చూపుతున్నట్లు తెలుస్తుంది. యంగ్ డైరెక్టర్ మల్లిడి వ‌శిష్ట‌ డైరెక్షన్‌లో.. మెగాస్టార్ విశ్వంభర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫాంటసీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా వేసవిలో రిలీజ్ చేయాల్సింది.

The teaser of Megastar Chiranjeevi's Vishwambhara is out on UV Creations Youtube channel. #chiranjeevi

కానీ.. విఎఫ్ ఎక్స్ వర్క్‌స్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. జూలై లేదా ఆగస్టులో రిలీజ్ ఉంటుందని టాక్ నడిచింది. అయితే ఇప్పుడు విశ్వంభర టీం కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఫైనల్గా దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేసేలా ఫిక్స్ అయ్యారట మేకర్స్. వర్క్ హడావిడిగా పూర్తి చేసేయకుండా కొంత సమయాన్ని తీసుకుని.. ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ హైప్‌ పెంచేలా అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే దసరా కానుకగా సెప్టెంబర్ 25న విస్వంభ‌ర‌ సినిమాను కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. అదే జరిగితే మరోసారి బాక్సాఫీస్ దగ్గర చిరు వర్సెస్ బాలయ్య వార్ రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహం లేదు. మరి ఈసారి ఫైట్ లో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాలి.