మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. ఎలాంటి ఎమోషన్స్ అయినా అవలీలగా పండించి.. ఎంత పెద్ద భారీ డైలాగ్స్ అయినా ఎంత కష్టమైనా డ్యాన్స్ స్టెప్స్ అయినా సింగిల్ టేక్ లో చేసి చూపించగల ఈ జనరేషన్ ఏకైక నటుడు అనడంలో అతిశయెక్తి లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ తన 30 సినిమాల ఎక్స్పీరియన్స్ లో ఎన్నో మంచి పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఈ జనరేషన్ స్టార్ హీరోస్ ఎవరు టచ్ చేయడానికి సాహసించని.. మైథెలాజికల్, సోషియా ఫాంటసీ సినిమాల్లో కూడా సత్తా చాటాడు. ఈ క్రమంలోనే తారక్ పై డైరెక్టర్స్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.
ఇక ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తర్వాత దేవరతో బ్లాక్ బాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇదే సినిమాను జపాన్ లో రిలీజ్ చేశారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ చేస్తున్న సందడి మనం చూస్తూనే ఉన్నాం. అంతేకాదు.. కొరటాల కూడా తాజా సినిమా ప్రమోషన్స్ లో సందడి చేశాడు. ఇందులో భాగంగానే ఆయన లెజెండ్రీ డైరెక్టర్ కె. విశ్వనాథ్ గురించి ప్రస్తావించారు తనకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ కె. విశ్వనాథ్ గారు.. ఎవర్గ్రీన్ మూవీ సాగర సంగమం సినీనని రూపొందించారు. ఈ సినిమా ఎప్పటికీ ఎవర్గ్రీన్ మూవీనే అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించగా.. ఇలాంటి సినిమా తీయడం అంటే ఈ జనరేషన్ డైరెక్టర్లకు చాలా ఇష్టం ఉంటుందని.. ఇక ఇప్పుడున్న డైరెక్టర్స్ లో ఈ సినిమాను ఎవరైనా రీమేక్ చేస్తే.. కచ్చితంగా ఈ సినిమాకు హీరోగా ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు.. అతనే ఏకైక ఛాయిస్ అంటూ కొరటాల కామెంట్స్ చేశాడు. గతంలో కే. విశ్వనాథ్ కూడా సాగర సంగమం ఈ జనరేషన్ హీరోస్ చేయాల్సి వస్తే ఎన్టీఆర్ వల్లే అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మొదటినుంచి ఎన్టీఆర్ కు క్లాసికల్ డ్యాన్స్ వచ్చు. ఇక ఆయన డ్యాన్స్ లో స్పెషల్ రిథమ్, స్టైల్ ఉంటాయి. ఈ క్రమంలోనే సాగర సంగమం లాంటి ఎవర్గ్రీన్ క్లాసికల్ హిట్ ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమని.. కొరటాల చెప్పింది 100% కరెక్ట్ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు.