టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్స్‌పైకి వస్తే బాగుండని ఎంతోమంది అభిమానులు కళ్ళు కాయలుకాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ.. రకరకాల కారణాలతో ఆ కాంబోలు కుదరవు. ఇమేజ్ పరంగా చూస్తే సరితూగవనో.. లేదా ఆ కాంబినేషన్లో సినిమాస్ వస్తే సెట్ కావనో.. ఇలా రకరకాల అభిప్రాయాలతో ఎవరు అలాంటి కాంబోలో సినిమాలు తెరకెక్కించడానికి ముందుకు రారు. కానీ.. అభిమానుల మాత్రం వాళ్ల కాంబోలో సినిమాలు వస్తే బాగుంటుందని.. గట్టిగా కోరుకుంటారు. అలాంటి కాంబినేషన్స్‌లో టాలీవుడ్ బ్రదర్స్ కాంబోలు కూడా ఉన్నాయి.
నందమూరి బ్రదర్స్:
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే బాగుండని నందమూరి అభిమానులంతా ఎప్పటినుంచ కోరుకుంటున్నారు. వీళ్లిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా.. ఇద్దరు సొంత అన్నతమ్ముళ్లలా ఆప్యాయంగా ఉంటారు. ఇక వీరిద్దరిలో తారక్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతుంటే.. కళ్యాణ్ రామ్ రీజనల్ స్టార్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే తమ్ముడుతో.. అన్నయ్య కలిసి నటిస్తే కళ్యాణ్ రామ్‌కు కూడా.. పాన్ ఇండియన్ ఇమేజ్ వస్తుంది.
అల్లు బ్రదర్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అల్లు శిరీష్ ఇద్దరు అన్నదమ్ములు ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతుంటే.. అల్లు శిరీష్ మాత్రం రీజినల్ ఇమేజ్స్ తో కొనసాగుతున్నాడు. వీళిద్దరు మల్టీ స్టారర్ సినిమా చేస్తే పాన్ ఇండియా రేంజ్లో అల్లు శిరీష్‌కు కూడా ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పడుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మెగా బ్రదర్స్:
టాలీవుడ్ గ్లోబల్ స్టార్‌గా రామ్ చరణ్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక.. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, రామ్ చరణ్ సొంత అన్నదమ్ములా ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. ఈ క్రమంలోనే ఈ మెగా బ్రదర్స్ అయినా చరణ్, వరుణ్ తేజ్ కాంబోలో ఓ మల్టీ స్టారర్ వస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మెగా మేనల్లుడు:
టాలీవుడ్ సుప్రీమ్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి ధరంతేజ్, తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇద్దరు.. టాలీవుడ్లో నటులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటికే పలు సినిమాల్లో నటించి సక్సెస్ అందుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి.. సినిమాతో వెండితెరపై మెరిస్తే బాగుంటుందని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఈ పై చెప్పిన టాలీవుడ్ స్టార్ హీరోస్ గట్టిగా అనుకుంటే.. వారి బ్రదర్స్‌తో సినిమా చేయడం పెద్ద మ్యాటర్ ఏమీ కాదు.. ఈ క్రమంలోనే ఈ అన్నదమ్ముల కాంబోలో సినిమా సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి.