కృష్ణంరాజు ఫేవరెట్ మహేష్ బాబు మూవీ ఏంటో తెలుసా.. రెబల్స్ కు మాత్రమే నచ్చే సినిమా..!

టాలీవుడ్ సీనియర్ రెబల్ స్టార్.. కృష్ణంరాజు తన కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగ‌త్మ‌క‌ సినిమాల్లో నటించి వెండితెరపై తన నటన, అటిట్యూడ్‌తో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఆయన కెరీర్‌లో.. సూపర్ హిట్ సినిమాలు అంటే కృష్ణవేణి, భక్తకన్నప్ప, మన ఊరి పాండవులు లాంటి సినిమాలు టక్కున గుర్తుకొస్తాయి. కృష్ణంరాజు అనేక మల్టి స్టార‌ర్‌ సినిమాల్లో కూడా నటించారు. అంతేకాదు.. కృష్ణంరాజు సూపర్ స్టార్ కృష్ణతో పలు సినిమాల్లో మెరిసారు. ఈ క్రమంలోనే.. కృష్ణ, కృష్ణంరాజు కుటుంబాల మధ్యన మంచి బాండ్ ఉంది.

అలా కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయం చేయగా.. కృష్ణ నటవారసుడుగా మహేష్ బాబు వ‌చ్చి స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుత జనరేషన్ హీరోలతో సైతం నటించిన కృష్ణంరాజు.. బ్ర‌తికున స‌మ‌యంలో మహేష్ బాబు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ సినిమాల్లో తనకు ఇష్టమైన మూవీ ఏంటో వెల్లడించాడు. అయితే మహేష్ బాబు సినిమాలో పోకిరి, మురారి, ఒకడు లాంటి సినిమాల పేర్లు ఎక్కువ వినిపిస్తాయి. అయితే.. కృష్ణంరాజు మాత్రం వాటన్నిటికీ భిన్నంగా బిజినెస్‌మాన్ సినిమా అంటే చాలా ఇష్టం అంటూ వివరించాడు.

Business Man | Cinema Chaat

ఇక ఈ సినిమాలో సమాజంపై తనకున్న అభిప్రాయాన్ని డైరెక్టర్ రెబల్గా చూపించాడ‌ని.. మహేష్ బాబు నటన కూడా చాలా నేచురల్ గా అనిపించిందంటూ వివరించారు. అది కంప్లీట్ హీరో ఇజం బెస్డ్‌ మూవీ అని.. మహేష్ బాబు డైలాగ్ డెలివరీ, పెర్ఫార్మన్స్ ఒక ఫ్లోలో సాగిపోయింది అంటూ కృష్ణం రాజు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా బిజినెస్ మ్యాన్ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ కంటే.. మాస్, రెబల్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారన‌టంలో అతిశ‌యోక్తి లేదు.