టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్‌లో దర్శక ధీరుడుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక జక్కన ఎప్పటినుంచో ఓ డ్రీం ప్రాజెక్టు ఉంది. అది మహాభారతం అని దాదాపు అందరికి తెలుసు. ఈ సబ్జెక్టు పై ఆడియన్స్‌లోను మంచి ఆసక్తి నెలకొంది. మహాభారతం కి సంబంధించిన ఏ చిన్న అంశం సినిమాగా వచ్చిన ఆడియన్స్‌లో ఎంతో ఆసక్తి నెలకొంటుంది. ఉదాహరణకు ఇదే బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన కల్కి సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలిసిందే. ఇక సినిమా క్వాలిటీ పరంగా ఆకట్టుకున్న, ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదని విమర్శలు వినిపించాయి. అయినా ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అలాంటిది.. మహాభారతంపై ఒక పూర్తి సినిమా తీస్తే ఎలాంటి సంచలనాలు క్రియేట్ అవుతాయో ఊహించడం కూడా అసాధ్యం.
అలాంటి ఓ క్రేజీ ప్రాజెక్టును.. జక్కన్న ఏకంగా ఆరు భాగాలుగా చూపించాలని ఫిక్స్ అయ్యారు. కాగా.. మహేష్ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉంటుందని పలు వార్తలు వినిపించాయి. తన విజన్‌లో ఉన్న మహాభారతాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించడంలో రాజమౌళి దిట్ట. అయితే.. ఆయనకంటే ముందుగా ఓ తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ ఏకంగా రూ.700 కోట్ల బడ్జెట్ తో మహాభారతాన్ని తెరకెక్కించనున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించాడు. అతను ఎవరో కాదు.. లింగు స్వామి. గతంలో పందెంకోడి, ఆవారా లాంటి సినిమాలు తెరకెక్కించి.. రీసెంట్గా రామ్ పోతినేని.. ది వారియర్ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్‌గా నిలిచింది. ఇక లింగుస్వామి తీసుకున్న బ్యాక్ డ్రాప్ వేరని తెలిస్తుంది.
ఆయన కేవలం మహాభారతంలోని అర్జునుడు, అభిమన్యుడు క్యారెక్టర్లను బేస్ చేసుకుని రెండు భాగాలుగా మహాభారతాన్ని తెరకెక్కించనున్నాడట. అంటే విరాటపర్వంలో ఉన్నప్పుడు జరిగే కథ. లింగు స్వామి సినిమా అభిమన్యుడు మరణం వరకు ఉండబోతుందని టాక్. ఈ క్రమంలోనే కురుక్షేత్ర యుద్ధం మొత్తం రెండో భాగంలో చూపిస్తాడట. రాజమౌళి సినిమాపై ఈ మూవీ ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే రాజమౌళి కురుక్షేత్ర యుద్ధం మీదనే.. మూడు భాగాలు తీయబోతున్నారు. ఈ క్రమంలోనే జక్కన తీసే మహాభారతం సిరీస్‌లో అభిమన్యుడు పై కూడా ప్రత్యేకమైన స్టోరీ ఉంటుంది. కనుక కచ్చితంగా జక్కన్న ప్రాజెక్ట్ పై ఎంతో కొంత ప్రభావం పడుతుందని.. నెటిజన్స్ డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు. మరి కొంతమంది మాత్రం.. ఎంతమంది ఈ తరహాలో సినిమాలు తెరకెక్కించిన.. రాజమౌళి విజన్, ఆయన డైరెక్ట్ చేసే తీరు చాలా స్పెషల్.. కచ్చితంగా ఆ సినిమాపై ఎన్ని సినిమాలు వచ్చిన ప్రభావం పడదంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.