టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా లైనప్‌తో బిజీగా గడుపుతున్న ప్రభాస్ చేతులో.. ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ది రాజా సాబ్ సినిమా షూట్‌లో సందడి చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా పూర్తయిన తర్వాత.. హనురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజీ సినిమాలో నటించనున్నాడు. దీంతో పాటే.. స్పిరిట్, సలార్ 2, కల్కి 2 సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి. అంతేకాదు హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ పై మరో మూడు సినిమాలను నటించనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది.
ఈ క్రమంలోనే ప్రభాస్ నుంచి కచ్చితంగా ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా చూసుకుంటూ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ ఇస్తున్నాడు. కాగా ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించిన ఒక కేజీ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు నటవారసుడుగా ప్రభాస్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. పాన్ ఇండియా లెవెల్‌లో రాణిస్తున్నాడు. అయితే ప్రభాస్ తో పాటు.. ఆయన తమ్ముడు సిద్ధార్థ రాజ్ కుమార్ కూడా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి చాలా మందికి తెలియదు.
ఇక సిద్ధార్థ్ రాజ్.. కెరటం అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేయలేదు. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి బిజినెస్ ట్రాక్‌లోకి అడుగుపెట్టి బిజినెస్ లో రాణిస్తున్నాడు. అయితే ప్రభాస్ ఫ్యామిలీ నుంచి ఆయన తమ్ముడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా నటించాడు అన్న సంగతి ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది అన్న రెబల్ స్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంటే.. తమ్ముడు మాత్రం ఒక్క ఫ్లాప్‌కు ఇండస్ట్రీని వదిలేయడం చాలా బ్యాడ్ లక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.