ప్రస్తుతం దుబాయ్‌లో గ్రాండ్‌గా జరుగుతున్న ఓ ప్రైవేట్ వెడ్డింగ్‌లో టాలీవుడ్ స్టార్స్ అంత మెరుస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ వైరల్గా మారుతున్నాయి. ఇక ఈ వెడ్డింగ్‌కు సినీ సెలెబ్రెటీలు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్, బిజినెస్ ప్రముఖులు సైతం హాజరై సందడి చేస్తున్నారు. అయితే ఈ రేంజ్ లో స్టార్ సెలబ్రిటీస్, ప్రముఖులంతా పాల్గొంటున్న ఈ ప్రైవేట్ మ్యారేజ్ ఎవరిది అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. టాలీవుడ్ లో పలు సినిమాలను నిర్మించిన ఏఎమ్ఆర్ గ్రూప్ చైర్మన్.. ఏ. మహేష్ రెడ్డి తనయుడు పెళ్లి దుబాయ్‌లో గ్రాండ్ లెవెల్లో జరుగుతుంది.
ఈ పెళ్లి కోసం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులంతా దుబాయ్ కి చేరుకున్నారు. మహేష్ రెడ్డి భక్తి సినిమాలైనా షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. దుబాయ్‌లో అంగరంగ వైభవంగా.. ఎంతో గ్రాండ్గా పెళ్లి జరుగుతున్న క్రమంలో.. ఇప్పటికి టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా అక్కడకు చేరుకున్నారు. వీరేకాదు.. మరికొంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలోకి హాజరుకానున్నరని సమాచారం. ఇక ఈ పెళ్లి కోసం టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య.. నమ్రత, కూతురు సితార, అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు.
అయితే వీరంతా ఒకరితో ఒకరు కలిసి దిగిన ఫొటోస్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలో ఎన్టీఆర్ చాలా స్లిమ్ లుక్ లో మెరిసాడు. ఇక ప్రస్తుతం వార్ 2 షూట్‌లో బిజీగా ఉన్న తారక్.. తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూట్ ప్రారంభమైంది. అయితే తారక్ సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి మరి కొంత సమయం మిగిలుంది. ఇక మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఇప్పటికే మహేష్ పాస్‌పోర్ట్‌ను కూడా సీజ్ చేశాడు జక్కన్న. ఈ క్రమంలోనే మహేష్ పెళ్లికి హాజరు కాలేదని సమాచారం.