సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు క్రేజీ కాంబోలు తెరకెక్కుతూనే ఉంటాయి. ఇక ఇటీవల కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ సైతం మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూప్తున్నారు. అంతేకాదు ఆడియన్స్ సైతం తమ ఫేవరెట్ హీరోల కాంబోలో వచ్చే సినిమాలు చూసేందుకు ఆరాటపడుతున్నారు. ఇలాంటి క్రమంలోనే చాలామంది ఫ్యాన్స్ కొన్ని క్రేజీ కాంబోలో సినిమా సెట్ అయితే బాగుంటుందని ఊహించుకుంటూ ఉంటారు. కానీ.. అవి ఏవేవో కారణాలతో వర్కౌట్ కావు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మల్టీ స్టార్ సినిమాలంటే ఇప్పుడు అంతా ఆసక్తి చూపుతున్నారు కానీ.. ఒకప్పుడు ఒక స్టార్ హీరో సినిమాలో.. మరో స్టార్ హీరో నటించాలంటే సులువుగా ఒప్పుకునే వారు కాదు.
అలా గతంలో క్రేజీ కాంబో కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే ఇప్పటికీ ఆ క్రేజీ కామబో సెట్స్ పైకి రాలేదు. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ. వీరిద్దరూ తోపు హీరోసే. ఇద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు ఆశపడుతున్నారు. అయితే ఈ కోరిక మాత్రం ఇప్పటివరకు నెరవేరలేదు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌తో, పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంటే.. రెబల్ స్టార్ పాన్ ఇండియా సినిమాలతో బిజి బిజీగా దూసుకుపోతున్నాడు. అయితే గతంలో.. వీరిద్దరు కాంబోలో సినిమా రావాల్సి ఉండగా.. అది మిస్ అయింది. ఈ న్యూస్ ఇప్పుడు అందరికీ షాక్‌ను కలిగిస్తుంది.
ఇంతకీ వీరిద్దరి కాంబోలో మిస్ అయిన ఆ సినిమా ఏమై ఉంటుందో.. ఒకసారి తెలుసుకుందాం. ప్రభాస్ హీరోగా రెబల్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మొదట పవన్ కళ్యాణ్ ని భావించారట రాఘవ లారెన్స్. పవన్ కళ్యాణ్ కి కూడా కథ వినిపించగా.. పవన్ స్టోరీ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఈ క్రమంలోనే వీళ్ళ కాంబోలో రావలసిన సినిమా మిస్సయింది. అయితే ఈ సినిమాకి ఎలాంటి డిజాస్టర్ టాక్ వచ్చిందో తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకుండా మంచిపని చేశాడంటూ.. లేదంటే ఆయన రేంజ్ మరింతగా తగ్గిపోయేది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఫ్యూచర్లో మాత్రం వీరిద్దరి కాంబోలో నిజంగా ఓ మంచి కథతో సినిమా వస్తే బాగుండని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.