టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా చరణ్ నుంచి తెరకెక్కిన గేమ్ ఛేంంజర్ సినిమా ఫ్లాప్ అయిన.. చరణ్ క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. కాగా చరణ్ మాత్రం గేమ్ ఛేంజర్ సినిమా రిజల్ట్‌తో.. తన నెక్స్ట్ సినిమాల విషయంలో మరిని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో తన 16వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు చరణ్. ఈ క్రమంలోనే ఫుల్ ఫీవర్‌లోను.. షూటింగ్లో పాల్గొని తెగ కష్టపడిపోతున్నాడు.
దీంతో మెగా ఫ్యాన్స్ అంతా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే చరణ్ తన 17వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పుష్పా 2తో సాలిడ్ హీట్ అందుకున్న సుకుమార్ డైరెక్షన్‌లో.. చరణ్ తన 17వ సినిమా నటించనున్నాడు. ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ కు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. రామ్ చరణ్.. త్వరలోనే విదేశాలకు వెళ్లి మోకాలకు సర్జరీ చేయించుకోబోతున్నాడని న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఆయనకు మోకాలో చిన్న సమస్య ఏర్పడిందని.. ఈ కారణంగానే నొప్పిని భరించలేకపోతున్నా చరణ్ వైద్యుల సలహాతో చిన్న మైనర్ సర్జరీకి సిద్ధమైనట్లు టాక్ నడుస్తుంది.
ఈ క్రమంలోనే ఆర్సి 16 షూట్ కు కూడా కొంతకాలం బ్రేక్ తీసుకోనున్నాడట చరణ్. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ గా మారడంతో.. మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అసలు చరణ్ కు ఏం జరిగి ఉంటుంది.. ఎందుకు ఆ మొక్కాలు సర్జరీ.. అసలు ఇందులో వాస్తవం ఎంత అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఇక నిన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ ఆరోగ్యం క్షమించిందంటూ రకరకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై చిరంజీవి రియాక్ట్ అవుతూ ఇలాంటి ఊహగానాలు వైరల్ చేయవద్దంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఇలాంటి క్రమంలో రాంచరణ్ మోకాలు సర్జరి అంటూ వార్తలు వినిపించడంతో.. చరణ్ దీనిపై రియాక్ట్ అయితే బాగుంటుందని.. క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.