సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో, హీరోయిన్లుగా రాణించి.. కొంతకాలం గ్యాప్ తర్వాత వయసు రిత్యా క్యారెక్టర్ ఆర్టిస్టులు నటిస్తున్న వారు చాలామంది ఉంటారు. అయితే చిన్న వయసులోనే హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించిన ముద్దుగుమ్మలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రస్తుతం మాట్లాడుకోబోతున్న ఈ ముద్దుగుమ్మ కూడా అదే కోవకు చెందుతుంది. ఆమె మరెవరో కాదు. టాలీవుడ్ స్టార్ నటి ప్రగతి. మొదట హీరోయిన్గా నటించిన ప్రగతి.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. కేవలం 24 ఏళ్ల వయసులోనే తన వయసు ఉన్న హీరోయిన్లకు తల్లిగా నటించింది. తల్లి, అక్క, వదిన లాంటి పాత్రలో మెరిసిన ప్రగతి.. సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్, ఒంగోలుకు చెందిన ఈ అమ్మడు.. మైసూర్ సిల్క్ ప్యాలెస్ మోడల్గా వ్యవహరించింది.
ఈ క్రమంలోనే సినిమాలపై ఆసక్తితో మద్రాస్ అడుగుపెట్టి తమిళ్ యాక్టర్ భాగ్యరాజ్.. విట్ల విశేషాంగా సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో మెరిసింది. తర్వాత.. పెళ్లి చేసుకుని మూడేళ్ల పాటు నటనకు దూరమైన ప్రగతి.. తర్వాత పలు సీరియల్స్ తో రీ ఎంట్రి ఇచ్చింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోని పలు సీరియల్ లో కనిపించింది. ఇక ప్రస్తుతం ఐదు పదల వయసుకు దగ్గర పడుతున్న ఈ అమ్మడు చెక్కుచెదరని అందం, ఫిట్నెస్తో కూర కారును సైతం ఆకట్టుకుంటుంది.
గంటలు తరబడి జిమ్ చేస్తూ.. టైట్ ఫిట్స్ జాకెట్లు వేసుకొని బోల్ట్ అందాలతో రెచ్చగొడుతుంది. ఈ విషయంపై ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపించినా.. ఎలాంటి ట్రోల్స్ వచ్చినా.. వాటిని పట్టించుకోకుండా తన దారిలో తాను వెళుతుంది ప్రగతి. అంతేకాదు ఏకంగా నేషనల్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పాల్గొని ప్రొఫెషనల్స్‌కు గట్టి పోటీ ఇస్తూ 3వ స్థానాన్ని క్కించుకుంఇ. అయితే కెరీర్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు.. పర్సనల్ లైఫ్ లో మాత్రం.. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న భర్త తీరుతో విసిగిపోయి అతనికి విడాకులు ఇచ్చింది. కూతురుతో పాటు ఇంట్లోంచి బయటకు వచ్చేసినా ఈ అమ్మడు.. ఓ సందర్భంలో మాట్లాడుతూ.. హీరోయిన్గా పిక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని అతిపెద్ద తప్పు చేశానంటూ వెల్లడించింది.
ఈ నిర్ణయం వల్ల నా జీవితం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఆమె రెండో పెళ్లికి, క్యారెక్టర్ కు సంబంధించిన ఎన్నో రకాల నెగిటివ్ వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటికి చెక్ పెడుతూ వస్తుంది ప్రగతి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ.. పెళ్లి, తోడు ముఖ్యమైన కానీ.. నా మెచ్యూరిటీ లెవెల్స్కు సరైన వ్యక్తి దొరకడం కష్టమే అంటూ ఆమె కామెంట్ చేసింది. పెళ్లి అయ్యాక నువ్వు ఇలా ఉండు.. ఇలా చేయి అంటూ కట్టుబాట్లు పెడితే నేను భరించలేనని చెప్పుకొచ్చింది. బహుశా నాకు ఇప్పుడు 20 ఏళ్ళు వయసు ఉండి ఉంటే కనుక దాని గురించి ఆలోచించేదాని. కానీ ఇప్పుడు అది నా చేయి దాటిపోయింది. సొసైటీకి మాత్రం మంచి పిల్లలను ఇచ్చా ఈ విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్న అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.