మహేష్ సినిమాతో హీరో నిఖిల్ కు రూ.150 కోట్ల లాభం.. ఎలాగో తెలిస్తే షాకే..!

హ్యాపీ డేస్ సినిమాతో సెకండ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సిద్ధార్థ్‌.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక త‌న సినీ కెరీర్‌లో ఎన్నో ఫ్లాప్‌లు ఉన్నాయి. అయినప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడ్డారు నిఖిల్. ఇక స్వామి రారా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. త‌ర్వాత నుంచి జాగ్ర‌త్త‌గ‌ అడుగులు వేస్తూ కెరీర్ పరంగా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ కెరీర్‌లో ఉన్న ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కార్తికేయ సిరీస్ చాలా స్పెషల్. ఈ సినిమా నిఖిల్‌కు సుస్థిరమైన మార్కెట్ ను తెచ్చి పెట్టింది. ఇక కార్తికేయ 2 అయితే ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. సినిమా కేవలం టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంది.

Khaleja - Wikipedia

ఈ క్రమంలోనే సినిమాకు దర్శకత్వం వహించిన చందు మొండేటి మరోసారి నాగచైతన్యతో తండేల్ సినిమాను తెరకెక్కించి భారీ సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ టైం లో చందు మొండేటి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తికేయ సిరీస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వివరించాడు. నాకు త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబోలో వ‌చ్చిన‌ ఖలేజా సినిమా అంటే చాలా ఇష్టమని.. నేను తీసిన కార్తికేయ సిరీస్.. ఐడియా పుట్టుకొచ్చిందే ఖలేజా సినిమా నుంచి అంటూ వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక కార్తికేయ 2 కి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.150 కోట్లు గ్రాస్ వ‌సుళ్లు వచ్చాయి.

Karthikeya 2 Ott Release: Nikhil Siddhartha's Karthikeya 2 to get showcased  on OTT soon. Check out when, where - The Economic Times

అన్ని భాషల్లో మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే చందు మొండేటి.. ఖ‌లేజా సినిమా లేకపోతే.. కార్తికేయ స్టోరీ ఐడియానే వచ్చేది కాదని చెప్పడంతో నిఖిల్ కెరీర్‌లో రూ.150 కోట్ల సినిమా ఉండడానికి ఇన్ డైరెక్ట్ గా మహేష్ బాబు కారణం అని.. నిఖిల్ కు ఇంత లాభం మహేష్ బాబు వల్లే వచ్చిందంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మ‌హేష్ ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం నిఖిల్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా స్వయంభులో నటిస్తున్నారు. పీరియాడికల్ జోన‌ర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై.. ఆయన పూర్తి నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న నిఖిల్.. స్పీడ్‌కు స్పై సినిమా బ్రేక్ వేసింది. దీంతో నిఖిల్ మరోసారి సినిమాలో సెలెక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్వయంభు మాత్రమే కాదు.. చరణ్ నిర్మాతగా వస్తున్న.. ది ఇండియన్ హౌస్ సినిమాల్లో కూడా నిఖిల్ హీరోగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూట్ పై సరైన క్లారిటీ లేదు.