జబర్దస్త్ చూస్తున్నదే అడల్ట్ కామెడీ కోసం.. నాపై కూడా అలాంటి కామెంట్స్.. ఇంద్రజ

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఇంద్రజ‌కు తెలుగు ఆడియన్స్‌లో పరిచయాలు అవసరం లేదు.. యమలీల సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. వ‌రుస పెట్టి స్టార్ హీరోలు అందరితోనూ సినిమాల్లో నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలో ప్రేమించి వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. తర్వాత జబర్దస్త్ జడ్జిగా రీఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ వల్గారిటీ లేకుండా ట్రెడిషనల్‌గా.. కంటెస్టెంట్లను కూడా గౌరవంగా పిలుస్తూ.. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. జబర్దస్త్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఆస్థాన జడ్జిగా మారిపోయిన ఈ షోస్ కారణంగా పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటుంది. అయితే ఇంద్రజ ఇంటర్వ్యూలో మాత్రం చాలా రేర్ గా మెరుస్తూ ఉంటుంది. అలా తాజాగా ప్రముఖ యూట్యూబర్‌ నిఖిల్ ఫోడ్‌ కాస్ట్ అయినా నిఖిల్‌తో నాటకాలు షోలో మెరిసింది.

Intro | Anusuya, Indraja |Jabardasth | 8th April 2021 | ETV Telugu

ఇక ఈ షోలో నిఖిల్ మాట్లాడుతూ.. మీరు చేస్తున్న షో లలో అడల్ట్ కామెడీ ఉంటుందని.. ఈ కామెడీకి ఇంద్రజ కూడా నవ్వుతుందంటూ బయట నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. మీరు కూడా అడల్ట్ కామెడీని ఎంకరేజ్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు.. దీనిపై మీ రియాక్షన్ ఏంటి అని అడగగా.. ఇంద్రజ రియాక్ట్ అవుతూ.. అలా నన్ను అనే వాళ్లందరికీ నేనొక్కటే చెప్పాలనుకుంటున్నా.. అది నా సొంత షో కాదు. కేవలం నేను అక్కడ పని చేస్తున్నాను అంతే. ఇక ఎంటర్టైన్మెంట్ అని వచ్చినప్పుడు కొన్ని విషయాలను మనం రెస్ట్రిక్ట్‌ చేయలేము. వాటిని పట్టించుకోకూడదు. ఎందుకంటే దాన్ని చూసేవాళ్ళు, దాని ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు, దానికోసమే షో చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూసి చూడనట్లు వెళ్లిపోవడం తప్ప మనం చేసేదేమీ లేదు. ఇక నేను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అనే కాదు.. డబల్ మీనింగ్ డైలాగ్లు, అడల్ట్ కంటెంట్ అనేది ఇండస్ట్రీ పరంగా ఎక్కడ చూసినా నెగెటివిటీ ఉన్న కూడా.. మంచి వ్యూస్తో వెళ్తున్నాయి.

Jabardasth జబర్దస్త్ నుంచి ఇంద్రజ అవుట్.. వెళ్లిపోతుందా? పంపించేస్తున్నారా అంటే? | Reason behind heroine indraja quitting jabardasth? - Telugu Filmibeat

ఒకవేళ నెగెటివిటీ ఉంటే వ్యూస్ ఉండకూడదు కదా.. మరి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. బ్యాడ్ అన్నప్పుడు ఆ బాడ్‌కే సపోర్ట్ వస్తుంది కదా అంటూ కామెంట్లో చేసింది. కుటుంబం అంతా కూర్చుని చూసేలా ఉందా అని మాట్లాడుకుంటారు. మరోపక్క ఫ్యామిలీ కంటెంట్ తో మంచి మంచి షోస్ వస్తున్న‌ సరే.. ఇప్పుడు అడల్ట్ కంటెంట్ కామెడీ అంటున్న షోస్ ని ఎక్కువగా ఆదరిస్తున్నారు. అప్పుడు ఎంటర్టైన్మెంట్ ను బిజినెస్ గా చేసే వాళ్ళు ఏం చేస్తారు.. దేనికి ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయో అవే కంటిన్యూ చేస్తారు. డబ్బులు దేనికి ఎక్కువ వస్తున్నాయో దాన్నే చూస్ చేసుకుంటారు. పబ్లిక్ ఓ విషయాన్ని ఛీ అంటే.. దానికి వ్యూస్ కూడా ఉండకూడదు. నేను కూడా చాలా సార్లు ఫీలయ్యా.. కొన్నిసార్లు నామీద కూడా డబ్బులు మీనింగ్ డైలాగ్స్ వినిపించాయి. అది జోక్ కనుక జోక్ లాగా వదిలేస్తా. కానీ.. కొన్ని మాటలు బాధ కలిగించాయి. అక్కడ అవసరం లేకపోయినా నన్ను కొంతమంది మాట అనేస్తారు. ఆ స్టేజ్ మీద చెప్పే విషయం అయితే కచ్చితంగా అక్కడే చెప్పేస్తా. లేదంటే తర్వాత పిలిచి వివరిస్తా. నువ్వు సరైన విధానంలో మాట్లాడలేదు.. ఇంకోసారి అలా అనొద్దని చెప్పేస్తా అంటూ వివరించింది. ప్రస్తుతం ఇంద్రజ కామెంట్స్ వైరల్ గా మారాయి.