సౌందర్య: ఆ మూవీ నటించడానికి అంతలా భయపడిందా.. కష్టం తట్టుకోలేక మధ్యలోనే తప్పుకోవాలనుకున్న సినిమా ఇదే..!

దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యకు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సహజ నాటన‌తో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఈ అమ్మడు.. ఎంత పెద్ద, కష్టతరమైన పాత్రలో అయినా ఇట్టే వదిగిపోయి నటించి.. సహజత్వాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలోనే తిరుగులేని స్టార్ హీరోయిన్గా రాణించిన సౌందర్య.. హఠాత్ మరణం అందర్నీ కలచివేసింది. అయితే ఆమె మరణించి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తయినా.. ఆమె సినిమాల ద్వారానో.. మరి ఏదైనా రూపంలో వార్తల్లో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఆమె గురించి ఏదో ఒక చర్చ బయటకు వస్తూనే ఉంటుంది. ఇక సౌందర్య లైఫ్‌లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు, షాకింగ్ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి.

Unforgettable Tragedy End of Indian Actress Soundarya - HubPages

అంతేకాదు ఆమె తీరని కలలు, ఆశలు కూడా ఎన్నో ఉన్నాయని సమాచారం. అయితే సౌందర్య లైఫ్ లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఎంత కష్టతరమైన పాత్ర కైనా జీవం పోసి.. పాత్రని రక్తి కట్టేస్తుంది. పాజిటివ్ పాత్రలే కాదు.. నెగిటివ్ పాత్రలను తనదైన స్టైల్‌తో మెప్పించిన సౌందర్య.. ఓ సినిమా విషయంలో మాత్రం చాలా భయపడిపోయిందట. తాను నటించలేనని.. తన వల్ల కాదని.. దర్శకుడుకి చెప్పి.. మధ్యలో తప్పుకోవాలని చూసిందట. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు.. అంతపురం. కృష్ణవంశీ డైరెక్షన్లో 1998లో వచ్చిన ఈ సినిమాలో సౌందర్యతో పాటు.. ప్రకాష్ రాజ్‌, సాయికుమార్, జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. ఇందులో సాయికుమార్‌కు జంటగా సౌందర్య మెరిసింది. వ‌ల‌న్‌ పాత్రల‌లో జగపతిబాబు, ప్రకాష్ రాజ్ కనిపించారు.

Anthahpuram (1998) - IMDb

రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో మూర్ఖత్వపు ఆచారాలు, రౌడీయిజం ప్రధానంగా తెర‌కెక్కిన ఈ సినిమా.. రా అండ్ ర‌స్ట్రిక్ గా కొనసాగింది. కృష్ణవంశీ 27 ఏళ్ల క్రితమే అలాంటి సినిమాతో హిట్ కొట్టారు. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. అలాంటి కాన్సెప్ట్ తో ఇప్పుడు సినిమా వస్తే మాత్రం కచ్చితంగా రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అనడంలో సందేహం లేదు. అయితే ఈ మూవీ ఏకంగా తొమ్మిది నంది అవార్డులను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ డీ గ్లామర్ లుక్ లో కనిపించాలి, దెబ్బలు తినాలి, కిందపడాలి, దారుణమైన సీన్స్ లో నటించాలి. ఈ నేప‌ద్యంలోనే సౌంద‌ర్య‌కు దెబ్బలు కూడా తగిలాయట. ఆ కష్టం, బాధని చూసి సౌందర్య.. వామ్మో ఈ పాత్రలో చేయడం నావల్ల కాదని.. కృష్ణవంశీకి చెప్పేసిందట.

Antahpuram

మొహమాటం ఎక్కువగా ఉండే సౌందర్య ఇలా చెప్పేసిందంటే.. ఆమె ఎంతగా ఇబ్బంది పడిందో.. ఎంత భయపడిందో అర్థం చేసుకోవచ్చు. కానీ.. కృష్ణవంశీ మామను కన్విన్స్ చేసి ఎలాగోలా సినిమాలో నటింప చేశారు. కారణం.. సినిమా మొత్తం ఆమె రోల్ చుట్టూనే తిరుగుతుంది. ఆమె తప్ప ఎవరూ చేయలేరని ఆమెను ఒప్పించారట. తాను కూడా తప్పని పరిస్థితిలో సినిమాను పూర్తి చేసింది. ఇక వీళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. అవార్డులు, రివార్డులు ఎన్నో వచ్చాయి. సౌందర్య కెరీర్‌లోనే ఈ సినిమా చాలా స్పెషల్ గా నిలిచిపోయింది.