టాలీవుడ్ పవర్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్.. మరోపక్క రాజకీయంగాను సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేనని. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా పవన్ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. శనివారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చేరిన పవన్ కళ్యాణ్.. పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్ తదితర సత్సంబంధిత పరీక్షలన్నీ నిర్వహించిన వైద్యులు రిపోర్టులు పరిశీలించిన నిమిత్తం మరికొన్ని పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ పరీక్షలు ఈ నెలాఖరు.. లేదా వచ్చే నెల మొదట్లో చేపించుకోవాలని సూచించారు. ఇక ఈనెల 24 నుంచి రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు జనసేన పార్టీ తన అధికారిక ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇక గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సయాటికా వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తున్నారు. కేరళ, తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలను సందర్శించిన పవన్.. ప్రయాగరాజుల మహా కుంభమేళలో ఉన్న త్రివేణి సంగమంలోనూ పుణ్యస్నానాలు ఆచరించాడు.
ఇక కొడుకు ఆకిరను కూడా తాను వెళ్లే ప్రతి చోటకు తీసుకువెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. అయితే సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. పవన్ తాజాగా హాస్పిటల్ లో చేరడం జనసేన పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో.. ఆప్డేట్ ఇవ్వాలని.. ఆయనకు బాగుంటే అందరూ బాగుంటారని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా చిన్నపాటి వైద్య పరీక్షల కోసమే పవన్ హాస్పిటల్లో చేరినట్లు సమాచారం. 24 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు పవన్ హాజరు కాబోతున్నారని తెలిసిందే. అంతే కాదు.. ప్రస్తుతం పవన్ ఆరోగ్యంగా ఉన్నాడట.