ప్ర‌భాస్ స్పిరిట్ కు ముహుర్తం ఫిక్స్‌.. గ్రాండ్ లాంచ్ అప్పుడే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో బిజీ లైన‌ప్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఏడాదికి కచ్చితంగా ఆయన నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటూ.. ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్న ప్రభాస్.. ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమా షూట్లో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఈ సినిమా షూట్ తుది దశకు చేరుకుంద‌ట‌. దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయ‌ని.. ఈ క్రమంలోనే మరో పక్క హ‌నురాగపూడి డైరెక్షన్‌లో ఫౌజి సినిమా షూట్‌లోను ప్రభాస్ ఈఅడుగుపెట్టాడ‌ని స‌మాచారం. అయితే ఇంకా ఈ రెండు సినిమాల షూట్ పూర్తి కాకముందే.. మరో కొత్త సినిమా ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతున్నాడట ప్ర‌భాస్‌.

అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్న సందీప్ రెడ్డివంగా డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఇక.. ఈ సినిమాల ప్రభాస్ ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడు కనిపించనంత డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడని.. సందీప్ రెడ్డి వంగా గతంలోనే వెల్లడించారు. ఇక హీరోలను భారీ రేంజ్లో ఎలివేట్ చేయడంలో సందీప్ రెడ్డి వంగాకు మించినవారు లేరనేంత‌లా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న‌ సందీప్ రెడ్డి.. ప్రభాస్ కోసం ఎలాంటి కథలు రాసుకున్నాడో.. ఆయనతో సినిమా ఎలా తెరకెక్కించనున్నాడో.. ప్రభాస్ పాత్ర ఏ రేంజ్‌లో ఉండనుందో.. అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.

సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరం వివరించాడు. ఇప్పటికే స్పిరిట్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్ మొదలైందని.. ఉగాది రోజున ఈ సినిమా పూజ కార్యక్రమాలతో గ్రాండ్ లెవెల్‌లో ప్రారంభించనున్నారని హర్షవర్ధన్ వివరించాడు. హర్షవర్ధన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సందీప్ అక్కడ లొకేషన్స్ రిక్కీ చేసి వచ్చాడని.. అక్కడ కొన్ని పోలీస్ సీన్స్ కూడా షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది. అంతేకాదు త్వరలో ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్‌తో పాటు.. స్టార్ కాస్టింగ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారట మేకర్స్‌.