సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న వారంతా స్టార్ హీరోలుగా తమకు తాము ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఒకరు క్రియేట్ చేసిన రికార్డులను మరొకరు బ్రేక్ చేస్తూ సరికొత్త సంచలనాలను సృష్టిస్తూ రాణిస్తున్నారు. అయితే టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మాత్రం అన్నిటికంటే స్పెషల్ అని.. సినీ ఇండస్ట్రీలోనే ఓ మైల్ స్టోన్ గా మారిందని.. పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేయడం అంత సులువు కాదు.. మరే హీరో కూడా పుష్పా 2 రికార్డులను టచ్ కూడా చేయలేడంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే పూర్తిగా రెండు నెలలు కాకుండానే పుష్పా 2 రికార్డులను పటాపంచలు చేసే దిశగా దూసుకుపోతుంది చావా. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ హిస్టోరికల్ మూవీ బాలీవుడ్‌లో పుష్పా2 క్రియేట్ చేసిన రికార్డులను దాటేస్తూ రాణిస్తుంది.
ఇక పుష్ప సినిమా సమయంలో అల్లు అర్జున్ పర్ఫామెన్స్‌ను ఏ రేంజ్‌లో అయితే ప్రశంసించారో.. ఇప్పుడు విక్కీ కౌశల్ నటనను అంతకుమించిపోయే రేంజ్‌లో తెగ పొగిడేస్తూ ఆయనను హైలైట్ చేస్తున్నారు అక్కడి జనం. టాలీవుడ్ ఆడియన్స్ సైతం చావా మూవీని వీక్షించి.. వికీ కౌశల్ నటనకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనను ప్రశంసిస్తూ ఎన్నో కామెంట్లు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు చావా, పుష్పా 2 రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఎవరికీ ఉంది అనే టాక్ ట్రెండ్ అవుతుంది. దీనికి పలువురు సమాధానాలు చెప్తూ.. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు నటిస్తున్న సినిమాతో అది సాధ్యమని.. కచ్చితంగా ఈ రెండు సినిమాల రికార్డులను పటాపంచలు చేస్తూ మహేష్ తన సత్తా చాటుకుంటాడని.. జక్కన్న ఈసారి హాలీవుడ్ రేంజ్‌లోనే కాదు మొత్తం పాన్ వరల్డ్ రేంజ్ రేంజ్ లో టాలీవుడ్ స్టామినా చూపించడం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇప్పటికే పాన్ ఇండియన్ స్టార్ హీరోస్గా తారక్, ప్రభాస్, చరణ్ రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల సృష్టించ లేకపోయినా ఈ రికార్డును.. ఎస్ఎంబి 29 బ్రేక్ చేస్తుందంటూ టాక్ మారుమోగిపోతుంది. ఈ క్రమంలోనే ఎస్ ఎస్ ఎం బి 29 కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. రాబోయే నెల రోజుల్లో మొత్తం ఆఫ్రికా అడవుల్లోనే షూట్‌ను చేయబోతుందని.. టీమ్ అంతా అక్కడికి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక మహేష్ బాబుకు క్రేజీ కండిషన్స్ పెట్టి మరీ.. జక్కన్న ఈ సినిమా షూట్ కి తీసుకెళ్తున్నాడట.