ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న రాంచరణ్.. ఇటీవల తన సినిమాలకు సీనియర్ హీరోయిన్‌లను ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చరణ్‌కు జంటగా.. బాలయ్య హీరోయిన్ నటించబోతుందంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఎవరా బ్యూటీ.. అసలు ఏ సినిమాలో నటించబోతుంది.. ఒకసారి తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఎంత మంచి స్టార్ హీరోయిన్ అయినా సరే.. 30 ఏళ్లు దాటితే ఆ హీరోయిన్లను ఫామ్ లో ఉన్న స్టార్ హీరోలు సెలెక్ట్ చేసుకోవడం మానేస్తారు. ఈ ట్రెండ్ టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మలను సీనియర్ల లిస్టులో వేసేస్తారు.. అలా 60 ఏళ్లు దాటిన హీరోల సరసన సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటివారు అంజలి, కాజల్, తమన్నా, సమంత, త్రిష, ప్రగ్య జైశ్వాల్ లాంటి హీరోయిన్లు సైతం ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్స్ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలకు జంటగా నటిస్తూ కొనసాగుతున్నారు.
కాగా రీసెంట్గా గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్.. అంజలిని సెకండ్ హీరోయిన్గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో తండ్రి పాత్ర చేసిన రోల్‌కు అంజలి భార్య.. చరణ్ కొడుకు రోల్‌కు తల్లిగా మెరిసింది. ఇక ఇప్పుడు మరోసారి రాంచరణ్ సరసన మరో సీనియర్ స్టార్ బ్యూటీ నటించబోతుందట. అది కూడా నందమూరి బాలయ్య బ్యూటీ చరణ్‌తో రొమాన్స్ చేయబోతుందని సమాచారం. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. ప్రగ్యాస్వాల్. ఈ సినిమాలో ప్రగ్యా నటించబోతుందట. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ఈ ప్రాజెక్టులో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తోంది. అయితే.. ఈ సినిమాలో మరో హీరోయిన్గా ప్రగ్యా జైశ్వాల్‌ని తీసుకున్నారని సమాచారం.
అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాకున్నా.. ఈ వార్త మాత్రం ప్రస్తుతం తెగ ట్రెండింగ్‌గా మారింది. అంతేకాదు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ తరహాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అంతకుమించే పవర్ఫుల్ కంటెంట్ కూడా ఉందని.. ఇక ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో ప్రగ్యా ప్రముఖ పాత్ర పోషిస్తుందని టాక్. ఇక ప్రగ్య ఇటీవల కాలంలో బాలయ్యతో వరుస సినిమాలో నటిస్తూ.. బ్లాక్ బస్టర్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అఖండ, డాకు మహారాజ్ రెండు సినిమాల్లోనూ ప్రగ్యా.. బాలయ్య సరసన మెరిసింది, ముచ్చటగా మూడోసారి ఆఖండ 2లో అమ్మడు బాలయ్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ క్రమంలోనే బాలయ్య లక్కీ బ్యూటీగా మారిపోయిన ప్రగ్యా.. రామ్ చరణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని న్యూస్ వైరల్ అవడంతో.. ఈ వార్తను తెగ ట్రెండ్ చేస్తున్నారు. కాగా చరణ్ సరసన.. ప్రగ్యా నటిస్తుంది వాస్తవమో కాదు తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.