మహేష్‌కు రాజమౌళి సీరియస్ వార్నింగ్.. కారణం తెలిస్తే మైండ్ బ్లాకే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జంగిల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో.. అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమాను తెర‌కెక్క‌నుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా తీయ‌నున్న‌ట్లు సమాచారం. దాదాపు రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో దుర్గ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై.. కె.ఎల్‌.నారాయణ సినిమాను నిర్మిస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు దీటుగా రాజమౌళి ఈ సినిమా రూపొందించ‌నున్న‌ట్లు సమాచారం.

ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్‌ సంపాదించుకున్న జక్కన్న.. నెక్స్ట్ తీయబోతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టుపై సినీ ప్రియుల‌తో పాటు.. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాడు రాజమౌళి. ఎలాంటి ప్రచారం నిర్వహించకుండా.. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. సైలెంట్గా షూట్ ను ప్రారంభించాడు. కాగా యాక్షన్ స‌న్నివేశాలు, అత్యంత ప్రమాదకరమైన సన్నివేశాలు ఇంకేమైనా ఆసక్తికర సన్నివేశాలను కూడా డూప్ లేకుండా తానే చాలా వరకు నటిస్తారు. దీనిపై మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఆయనను ఎన్నోసార్లు హెచ్చరించిన తన అలవాటును మానుకోలేదట.

అయితే ఇలాంటి సన్నివేశాలు నటించేటప్పుడు.. ప్ర‌మాదం ఏదైనా జరిగి హీరోకు గాయం అయితే.. షూట్‌కు అంతరాయం కలగడమే కాదు.. ఆయన కారణంగా కాల్‌షీట్లు ఇచ్చిన ఇతర నటీనటుల సమయం కూడా వృధా అవ్వడంతో పాటు.. చాలా డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. సినిమా బడ్జెట్ అనుకున్నదానికన్నా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇక అలా మహేష్ బాబు గతంలోనూ సుక్కుమార్‌ డైరెక్షన్‌లో 1 నేనొక్కడినే సినిమాలో ఓ భవనం పైనుంచి మరో భవనానికి జంప్ చేసే సీను డూప్ లేకుండా నటించారు. ఇవ‌ని జక్కన్న దృష్టిలో పెట్టుకొని.. మహేష్ బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఇటువంటి స్టాంట్స్‌ మానుకోవాలని.. కొన్ని సన్నివేశాలు డూప్‌ను వాడక తప్పదని.. నేనే నటిస్తానని మొండిపట్టు పట్టొద్దు అంటూ హెచ్చరించాడట. రాజమౌళి లాంటి దర్శకుడు గట్టిగా చెప్పిన తర్వాత ఎవరు మాత్రం ఎదురు మాట్లాడగలరు. అందుకే మహేష్ బాబు కూడా రాజమౌళి నిర్ణయానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.