ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏదైనా ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చిందంటే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలైతే అందులో వాస్తవం ఎంతో తెలియకపోయినా.. తెగ ట్రెండ్ చేసేస్తూ ఉంటారు జనం. ఈ క్రమంలోనే కొంతమంది ఆకతాయిలు అవతల వ్యక్తుల మనసు నచ్చుకుంటుందేమో అని ఆలోచించకుండా.. ఇష్టం వచ్చినట్లు రూమర్స్ క్రియేట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. సాధారణంగా స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన ఇష్యూస్‌లో నెటిజన్ల మధ్యన ఏదో ఒక వార్ కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే గాసిప్స్ ఏకంగా మెగాస్టార్ లాంటి స్టార్ హీరోలను సైతం బాధ పెట్టేలా ఉంటాయి.
ఇంతకీ అసలు మ్యాటర్ చెప్పలేదు కదా.. మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి అంజనాదేవికి ఆరోగ్యం బాగాలేదని.. ఆమెని తెల్లవారుజామున హాస్పిటల్‌కు తీసుకువెళ్లారని నిన్నటి నుంచి వార్తలు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ వార్తలు బాగా వైరల్ కావడంతో.. మెగాస్టార్ చిరంజీవి వరకు చేరాయి. ఆయన దీనిపై రియాక్ట్ అవుతూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్విట్‌లో.. తన తల్లి గురించి వచ్చిన వార్తలు ఆయన మనసును ఎంత గాయపరిచాయో అర్థం అయ్యేలా వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ మా అమ్మ అంజనీ దేవి గారి అనారోగ్యం క్షీణించిందని.. కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేశారంటూ..ఇంకా ఏవో వార్తలు రకరకాలుగా సోషల్ మీడియాతో పాటు, జనరల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
అవి నా దాకా వచ్చాయి అంటూ చెప్పుకొచ్చిన చిరంజీవి.. మా అమ్మగారు రెండు రోజులుగా కాస్త నలతగా ఉన్న మాట వాస్తవం. కానీ.. హాస్పిటల్‌కు తీసుకువెళ్లి చూపించాము. ప్రస్తుతం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఇంట్లో చలాకీగా తిరుగుతున్నారు. ఇకపై దయచేసి తన ఆరోగ్యం పై మీకు నచ్చినట్లుగా వార్తలు ప్రచారం చేయవద్దు అంటూ మీడియా ఛానల్స్ కు విజ్ఞప్తి చేశారు చిరంజీవి. మీరు ఇది అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నా అంటూ వెల్లడించాడు మెగాస్టార్. ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్‌తో పాటు.. సాధారణంగా నెటిజన్స్ కూడా ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. చివరకు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం అసలు సరికాదు అంటూ మండిపడుతున్నారు.