రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. ఏడాదికి రెండు సినిమాలు తన నుంచి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ప్రభాస్ చేసే సినిమాలు కారణంగా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు బతుకుతున్నాయని స్వయంగా యాజమాన్యమే ఓ ఈవెంట్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో.. రాజా సాబ్, ఫాజి లాంటి ప్రాజెక్టులలో బిజీగా గడుపుతున్నారు. రెండు సినిమాల రిలీజ్ తర్వాత.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. అంతే కాకుండా.. కల్కి 2, సలార్ 2 సినిమాలు కూడా ప్రభాస్ లైనప్‌లో ఉన్నాయి.
వీటితోపాటే హేంబాలే ఫీలిమ్స్‌లో మరో మూడు సినిమాలను ఆయన నటించనున్నాడు. ఇప్పటికే దీనిపై కూడా అఫీషియల్‌గా ప్రకటన వచ్చింది. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న త్రివిక్రమ్ కూడా.. నెక్స్ట్ అల్లు అర్జున్‌తో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించి.. తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు. చారిత్రక నేపథ్యంతో ఈ కథ తెరకెక్కనుందని.. ఇప్పటికే పూర్తి కథను రెడీ చేసి స్క్రిప్ట్ పనులలో గురూజీ బిజీ అయ్యాడంటూ టాక్ నడుస్తుంది. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్లో ఈ మూవీ తెరకెక్కనుందట. ఇలాంటి త్రివిక్రమ్ – ప్రభాస్ కాంబోలో కూడా ఓ సినిమా వస్తే చూడాలని అభిమానులంతా ఆశపడుతున్నారు.
అయితే బాహుబలికి ముందు ప్రభాస్ పలు సినిమాలో నటించే బ్లాక్ బస్టర్ అందుకున్నా.. తర్వాత ఐదు సంవత్సరాలు మరే సినిమాకు కేటాయించకుండా కేవలం బాహుబలితో బిజీగా గడిపాడు. ఈ క్రమంలో త్రివిక్రమ్ ప్రభాస్ కోసం ఒక కథ రెడీ చేసి వినిపించాడట. అయితే బాహుబలికి ఐదు సంవత్సరాల ఒప్పందం కుదరడంతో.. ఆ సినిమా కుదరలేదు. దీంతో ఆ స్టోరీ సెట్స్ పైకి రాలేదు. ఇప్పటికి త్రివిక్రమ్ ఆ కథను అలాగే ఉంచాడా.. లేదా మరో హీరోతో అయన తెరకెక్కించారా.. అనే దానిపై క్లారిటీ లేదు. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చి ఉంటే మాత్రం రికార్డులను బద్దలు కొట్టి ఉండేదంటూ సినీ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆయినా వీరిద్దరి కాంబోలో ఆ రేంజ్ సినిమా వచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.