యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుంది అనుకునే సమయానికి.. తాజాగా మస్తాన్ సాయితో లావణ్య వ్యవహారం సంచలనంగా మారుతుంది. ఇప్పటికే లావణ్య, మస్తాన్ సాయికి సంబంధించిన ఎన్నో కీలక అప్డేట్స్ రివీల్ అవుతున్నాయి. కాగా.. ఈ హార్డ్ డిస్క్ ను కూడా పోలీసులకు లావణ్య అప్పజెప్పింది. హార్డ్ డిస్క్‌లో వందల మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయని.. ఎంతో మంది అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వాళ్లతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు రివీల్ అయ్యాయని సమాచారం. అయితే.. మరికొన్ని విషయాలకు మాత్రం అసలు క్లారిటీ రావడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా లావణ్యకు సంబంధించిన షాకింగ్ ఆడియో కూడా వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెటింట సంచలనంగా మారింది. లావణ్యకు నిన్న, మొన్నటి వరకు సపోర్ట్‌గా మాట్లాడిన వారే.. ఈ ఆడియో రిలీజ్ కావడంతో.. ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంతకీ లావణ్యకు సంబంధించిన ఆడియోలో ఏముందో.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తాజాగా రిలీజైన ఆడియో కాల్‌లో మస్తాన్ సాయి గురించి లావణ్య ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్న లీక్స్ బయటకు వచ్చాయి. లావణ్య ఫోన్ కాల్‌లో ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ.. నీకు రూ.50 లక్షలు ఇస్తా.. మస్తాన్ సాయితో నాకు పెళ్లి జరిగేలా చూడు అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు.. నాకు రాజ్ తరుణ్ అంటే అస్సలు ఇష్టం లేదని.. అతని నేను ప్రేమించడం లేదంటూ కూడా ఆమె ఆ ఆడియోలో వివరించింది.
మస్తాన్ సాయిని ప్రేమిస్తున్నానని అతన్నే పెళ్లి చేసుకుంటానంటూ లావణ్య చెప్పుకొచ్చింది. అంతేకాదు మొత్తం సాయికి రూ.100 కోట్ల ఆస్తి ఉంది.. ఈ క్రమంలోనే నేను ప్రేమ పేరుతో అతని ట్రాప్ చేశా. నాకు రాజ్ తరుణ్ కంటే మస్తాన్ సాయి ఇష్టం.. అతన్ని నేను పెళ్లి చేసుకుంటా అంటూ లావణ్య ఎదుటి వ్యక్తితో మాట్లాడిన ఆడియో కాల్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. ఇక ఇని రోజులు అమాయకురాలని అనుకున్న లావణ్య నిజస్వరూపం రివిల్ అయిందంటూ.. చాలామంది ఆమెపై మండిపడుతున్నారు. ఆమెను తిట్టిపోస్తు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా మస్తాన్ సాయి, లావణ్య వ్యవహారం ఇంకా ముందు ముందు ఎంతవరకు ముదురుతుందో.. ఎక్కడకు దారి తీస్తుందో.. ఇంకేని దారుణాలు బయటకు వస్తాయో చూడాలి.