హరీష్ శంకర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసా.. హీరో ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో భారీ భారీ సక్సెస్‌లు అందుకుంటూ స్టార్ డైరెక్టర్లుగా రాణిస్తున్న వాళ్లే.. మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఆచితూచి కథలను ఎంచుకుంటూ సినిమాలను తెరకెక్కిస్తు.. ఈసారి ఎలాగైనా షోర్‌ షార్ట్ హిట్ కొట్టి తీరాల్సిందేనన్న ఆలోచనతో ఉంటున్నారు. ఇక డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ మాత్రం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అల‌స్యం అవుతున్న‌ క్రమంలో సినిమాకు సంబంధించిన ఎన్నో హింట్స్ ఇస్తూ ఆడియ‌న్స్‌లో ఆసక్తి పెంచుతున్నాడు. ఈ క్రమంలోనే ఉస్తాద్ భ‌గ‌త్‌ సింగ్ కోసం రమణ గోకుల్‌తో ఓ పాట పాడించాలనుకున్నట్లు వెల్లడించాడు. అంతేకాదు.. పవర్ స్టార్ కారుపై కూర్చొని ట్రావెల్ చేసే ఓ సీను ఉంటుందని.. ఆ సీన్ ఆడియన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తోందంటూ రకరకాలుగా లీక్స్ ఇస్తున్నాడు హరీష్ శంకర్.

ఇక ప్రస్తుతం ప‌వ‌న్ హరిహర వీరమల్లు సినిమా ప‌నులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఓజి సినిమా షూట్‌ను పూర్తి చేయాలి. ఈ రెండు సినిమాలు పూర్తయి రిలీజ్ అయితే గాని.. ఉస్తాద్‌ భగత్ సింగ్‌కు డేట్స్ ఇవ్వ‌డానికి తీరిక కుదరదు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పిలిచి కాల్‌షీట్లు ఇచ్చేవరకు హరీష్ ఏం చేయనున్నాడు.. ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి.. అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాగా ఉస్తాద్‌ భగత్ సింగ్ ప్రారంభించిన తర్వాత.. గ్యాప్ రావడంతో హ‌రీష్.. మాస్ మహారాజు రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ చేసిన తీరు, భాగ్యశ్రీ గ్లామర్, ఇద్దరి కాంబో సినిమా కావడంతో ఆడియన్స్ లో క్రేజ్.. ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాజిటివ్ బజ్‌ ఏర్పడిన.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు హరీష్.

Balakrishna | నేను రామ్ ను ఫాలో అయ్యాను | Balakrishna Reveals interesting  fact about Ram Pothineni

మరి ఈసారైనా సరైన స్ట్రాంగ్‌గా ప్లాన్ చేశాడా.. లేదా.. ఆయన నెక్స్ట్ సినిమా ఏ హీరో తీయబోతున్నాడనే అంశం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇటీవల బాలయ్యకు హరీష్ ఒక కథ చెప్పారని.. తర్వాత హీరో రామ్ లైన్‌లో ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఇద్దరిలో ఒకరితో హరీష్ శంకర్ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారని స‌మాచారం. కాగా మ‌రోవైపు ఇంకేదైనా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. అయితే తన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉన్న.. పర్ఫెక్ట్ హిట్ పడడం ఎంతైనా హరీష్ శంకర్‌కు చాలా అవసరం. మరి ఆయన మనసులో ఏముందో.. ? ఏ హీరోతో సినిమా చేస్తాడో..? ఏం ప్లాన్ చేస్తాడో..? పవర్ స్టార్ డేట్స్ కోసం ఇంకొంత కాలం ఎదురు చూస్తాడా..? తెలియాలంటే వేచి చూడాలి.