తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదు పదుల వయసులోను తన ఫిట్నెస్ తో, అందంతో కుర్రకారును ఆకట్టుకుంటున్న మహేష్.. విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నట వరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తండ్రి బ్యాగ్రౌండ్ వాడుకోకుండా తన సొంత కష్టంతో కెరీర్లో ఎదుగుతూ వచ్చాడు మహేష్. ఈ క్రమంలోనే మహేష్ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఫ్లాప్స్ కామన్. అలాగే మహేష్ కెరీర్‌లోను కొన్ని డిజాస్టర్లు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అంతేకాదు.. ఆయనకు అవకాశం వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలను చిన్నచిన్న రీజన్లతో రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అయితే.. మహేష్ బాబు తన క్యారెక్టర్‌కి సూట్ అవ్వదు అనిపిస్తే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా.. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే సినిమా అయినా.. ఆ సినిమాను టక్కున రిజెక్ట్ చేసేస్తూ ఉంటాడు. అలా ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లుగా మూడు సినిమాలను రిజెక్ట్ చేసాడు. బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్టులు అలా రిజెక్ట్ చేయడం.. ఆ మూడు సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మొదట సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమా మహేష్ బాబు చేయాల్సిందట. కానీ.. అంత వైల్డ్ క్యారెక్టర్ తాను చేయలేనంటూ రిజెక్ట్ చేశాడట. అయితే.. ఈ సినిమా తర్వాత రిలీజై ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో తెలిసిందే. ఇదే కాదు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమా కోసం కూడా మొదట మహేష్ బాబును అనుకున్నాడట సుకుమార్.
మహేష్ బాబు హీరో మాస్ ఎలివేషన్స్.. స్టోరీ నాకు సెట్ కాదని దీన్ని కూడా రిజెక్ట్ చేశాడట. అలా పుష్పా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఆయన ఖాతాలో నుంచి తప్పుకుంది. ఇక తాజాగా బాలీవుడ్‌లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతున్న చావా.. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కూడా మహేష్ బాబుని హీరోగా భావించారట. కానీ.. ఇలాంటి చారిత్రాత్మక ప్రాజెక్టులో నటించడం నాకు ఇష్టం లేదని.. సింపుల్గా మహేష్ దానిని రిజెక్ట్ చేశాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేయడం ప్రస్తుతం నెటింట హాట్ టాపిక్‌గా మారింది. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో ఆయనపై కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో ఎస్ఎస్ఎంబి29 కోసం పని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కనుంది. ఇక సెట్స్‌పైకి రాకముందే.. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మాత్రం.. రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. ఇప్పటివరకు మహేష్ రిజెక్ట్ చేసిన ఈ మూడు సినిమాల సక్సెస్ అంతా.. ఇదే సినిమాతో తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.