మోక్షజ్ఞతో సినిమా ఆగిపోయిందా.. బాలయ్య సమక్షంలో ప్రశాంత్ వర్మ క్లారిటీ..

నందమూరి న‌ట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మతో ఆయన డబ్బింగ్ మూవీ అఫీషియల్ ప్రకటన వచ్చింది. అయితే సినిమా సెట్స్‌పైకి రాకపోవడంతో.. ఎన్నో వార్తలు నెటింట‌ వైరల్‌గా మారాయి. మొదట మోక్షజ్ఞ అనారోగ్య కారణాల‌తో సినిమా కొంతకాలం వాయిదా పడిందని వార్తలు వినిపించినా.. ఇప్పటికీ సినిమా ప్రారంభం కాకపోవడంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయిందంటూ వార్తలు వినిపించాయి. బాలయ్యకు ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఫైనల్ స్క్రిప్ నచ్చలేదని.. దీంతో ఆల్టర్నేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆల్మోస్ట్ ఆగిపోయిందంటూ టాక్ న‌డిచింది.

అయితే తాజాగా ప్రశాంత్ వర్మ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య పద్మభూషణ్ పురస్కారాన్ని దక్కించుకున్న క్రమంలో ఆ హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకుంటూ.. బాలయ్య సిస్టర్ భువనేశ్వరి, పురందేశ్వరి, త‌దిత‌రులు ఓ పార్టీని గ్రాండ్ గా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో నందమూరి, నారా కుటుంబాలతో పాటు.. సినీ ప్రముఖులు.. అలాగే బాలయ్య చిన్ననాటి స్నేహితులు కూడా హాజరై సందడి చేశారు. వీరిలో బోయపాటి, అనిల్ రావిపూడి, బాబీ, గోపీచంద్ మాలినేని, ప్రశాంత్‌ వర్మ లాంటి.. టాప్ డైరెక్టర్స్ కూడా హాజరయ్యారు. ఇక బాలయ్యతో అప్పటికే రెండు యాడ్స్ ప్రశాంత్ వర్మ కలిసి చేశారు కూడా. అంతే కాదు అన్‌స్టాప‌బుల్‌లోను ఇద్దరూ కలిసి పనిచేశారు.

Is 'Hanuman' fame Prasanth Varma directing the father-son duo Balakrishna- Mokshagna? Here is what we know | - Times of India

ఈ క్రమంలోనే బలయ్య‌కు ప్రశాంత్ వర్మ పని నచ్చడం.. అలాగే ఆ సమయంలో ప్రశాంత్ వర్మ చెప్పిన స్క్రిప్ట్ కూడా ఆకట్టుకోవడంతో.. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే ఛాన్స్ ప్రశాంత్ వర్మకు ఇచ్చారు. కాగా.. ప్రశాంత్ వర్మ తాజాగా ఈవెంట్లో మాట్లాడుతూ.. బాలయ్య బాబుతో సినిమా చేయాలంటే భయం వేసింది.. ఇప్పుడు ఆయనపై గౌరవం పెరిగింది.. త్వరలోనే ఆయన పై ఉన్న ప్రేమను సినిమా ద్వారా చూపిస్తా అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇక్కడ ప్రశాంత్ వర్మ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే.. బాలయ్యతో సినిమా చేయబోతున్నాడా.. లేదా మోక్షజ్ఞ సినిమా గురించి ఆయన మాట్లాడాడా.. అనే సస్పెన్స్ ఆడియన్స్ లో మొదలైంది. అయితే ఆయన చేసిన కామెంట్స్ చూస్తే మోక్షజ్ఞ సినిమా ఆగిపోలేదని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మునుముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.