వాట్.. ప్రభాస్ కి అలాంటి ఫోబియానా.. అందుకే ఆ పాత్రల్లో చేయలేదా..?

టాలీవుడ్‌ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే ఫౌజీ సినిమాతో బిజీ కానున్నాడు. అయితే.. ప్రభాస్ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు షూటింగ్ కొంతకాలం నిలిపివేశారు మేకర్స్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ప్రభాస్ రికవరీ కనున్నాడ‌ట‌. ఇక వెంటనే రాజాసాబ్ పెండింగ్ షూట్ పూర్తి చేసి.. ఫౌజీ సినిమాను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడట. కాగా త్వరలో ఫౌజీ సినిమా షెడ్యూల్ తమిళనాడులో ప్రారంభించనున్నట్లు టాక్. మధురై సమీపంలో ఒక చిన్న గ్రామంలో మొదలుపెట్టి.. దాదాపు 20 రోజుల పాటు దేవిపురం అగ్రహారం నేపథ్యంలో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన సీన్స్ ను షూట్‌ చేయనున్నారని టాక్‌. ఈ నెలలోనే సినిమా షూట్ ప్రారంభం కాదట.

ఇక సినిమాల్లో యంగ్ బ్యూటీ ఇమ‌న్వీ హీరోయిన్గా కనిపించనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్లో.. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడుగా తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక కథ‌ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తనదైన న‌టన‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ కు ఓ ఫోబియా ఉందని.. ఆ కారణంగానే తను అలాంటి పాత్రలు నటించడంటూ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఎస్ ప్రభాస్ డాక్టర్ పాత్రలు నటించాలంటే చాలా భయపడతారట.

Who Is Imanvi? Here's All You Need To Know About The Female Lead Of Prabhas' Tentatively Titled 'Fauji'

ప్రభాస్ లాంటి స్టార్ హీరోకు డాక్టర్ పాత్ర అంటే భయం ఏంటి అనుకుంటున్నారా.. దానికి కారణం ఆయన ట్రీట్మెంట్ చేయడం.. సిరేంజ్ పట్టుకుని ఇంజక్షన్ చేయడం లాంటివి కొంతవరకు ఇబ్బందిగా ఫీల్ అవుతారట. దానికి అసలు కారణం ఆయ‌నకు చిన్నప్పటినుంచి ఇంజక్షన్ అంటే చాలా భయమని.. ఈ క్రమంలోనే సినిమాల్లోనైనా డాక్టర్ పాత్రల్లో సిరెంజ్‌తో నటించాలంటే నో చెప్పేస్తారని తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ప్రభాస్ ఒక సినిమాలో కూడా డాక్టర్ పాత్రలో కనిపించలేదు. ఈ క్రమంలోని న్యూస్ మరింత వైరల్ గా మారుతుంది. ఏమైనా ప్రభాస్ లాంటి స్టార్ నటుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండడం టాలీవుడ్ అదృష్టమనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా కీర్తిని అంత‌కంత‌కు పెంచుతున్నాడు. ఇక ప్రభాస్ తన నుంచి రానున్న కొత్త సినిమాలతో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటాడో వేచి చూడాలి.