ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో పాటు అభినయంతోను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తోటి స్టార్ హీరోయిన్లతో పోలిస్తే నెంబర్ వన్ అనే రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో అభిషేక్ బచ్చన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవల సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. సెకండ్ ఇన్నింగ్స్‌లో పోనియన్ సెల్వన్ లో నటించిన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు.. బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకుంది. ఇక అమ్మడీ సినిమాల విషయం పక్కన పెడితే.. అభిషేక్‌తో పెళ్లి తర్వాత ఆరాధ్య బచ్చన్ కు జన్మనిచ్చింది. ఇక ప్రస్తుతం అచ్చుగుద్దినట్లు అమ్మ పోలికలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఆరాధ్య.. ఇప్పటినుంచి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటుంది.
అయినప్పటికీ కొంతమంది దుర్మార్గుల కారణంగా ఆరాధ్య నిన్న హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే ఆరాధ్య కోర్టుకు వెళ్లడానికి కారణం మాత్రం సోషల్ మీడియా. కొన్ని యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం దారుణమైన వార్తలను ప్రచురించడమే. మనమంతా అలాంటి వార్తలను చూస్తూనే ఉన్నాం. బ్రతికున్న మనుషులను కూడా వ్యూస్ కోసం చంపేయడం.. విపరీతంగా ట్రోల్స్ చేయడం.. అర్థంపర్థం లేని థంబ్‌నెయిల్స్్తో ఎమోషన్స్ ను హర్ట్ చేయడం కామన్ గా జరుగుతూనే ఉన్నాయి. కాగా ఆరాధ్య బచ్చన్ తాజాగా ఇలాంటి నెగిటివ్ వార్తలు పై అసహనం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలా చేసింది. ఇక ఈ కేస్ విచారణను మార్చి 17 కు వాయిదా వేశారు. ఇదంతా పక్కన పెడితే.. గతంలో ఆరాధ్య బచ్చన్ ఇక లేరంటూ యూట్యూబ్ ఛానల్స్ వేసిన ఫేక్ వీడియోస్‌పై ఆరాధ్య తండ్రి అభిషేక్ బచ్చన్ కోర్టులో కేసు దాఖలు చేశారు.
దీంతో విచారణ వ్యక్తం చేసిన కోర్టు.. చిన్నారిపై ఈ లాంటి ఫేక్ వార్తలు రావడం దురదృష్టకరమంటూ.. తక్షణమే గూగుల్ యూట్యూబ్ సంబంధిత మధ్యమలన్నిటిలోనూ ఇలాంటి పోస్టులను తొలగించాలని ఆదేశాలు పంపింది. కోర్ట్ ఆదేశాలతో కొంతకాలం వాటిని కొంతకాలం తొలగించినా.. మళ్లీ ఇప్పుడు అవి సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ క్రమంలోనే ఆరాధ్య తిరిగి కోర్ట్ మెట్లు ఎక్కింది. ఈ వార్త వైరల్ కావడంతో ఓ వ్యక్తి గురించి అది కూడా చిన్నపిల్లల గురించి.. నీచమైన ఫేక్ పోస్ట్ లు క్రియేట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. కేవలం వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించడం కాదు అలాంటి ఫేక్ వార్తలు ఇంకోసారి ప్రచురించాలంటే భయపడేలా ఉండాలంటూ పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకర పోస్టులు అరికట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్న సంగతి తెలిసిందే.