టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత స్టార్ హీరో, హీరోయిన్లుగా, స్టార్ సెలబ్రిటీలుగా సెటిల్ అయినవారు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తమ నటనతో క్రేజ్ సంపాదించుకున్నా.. తర్వాత ఇండస్ట్రీకి దూరమై తమ లైఫ్ లీడ్ చేస్తున వారు ఉంటారు. అయితే అలా నటనతో ఆకట్టుకొని ఇండస్ట్రీకి దూరమైన సెలబ్రిటీలు ఇప్పుడు ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారో..? తెలుసుకోవాలని ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరు డాడీ మూవీలోని చైల్డ్ ఆర్టిస్ట్‌గా అక్షయపాత్రలో నటించి ఆకట్టుకున్న పిల్లి కళ్ళ పాప లేటెస్ట్ పిక్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.
ఇంతకీ ఈ అమ్మడు అసలు పేరు చెప్పలేదు కదా.. తనే అనుష్క మల్హోత్రా. ముంబైలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హమ్‌లో కుటుంబంతో కలిసి లైఫ్ లీడ్ చేస్తుంది. డాడీ సినిమా తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి సారించిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున అనుష్క.. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటు ఉంటుంది.
ఈ క్రమంలోనే తాజాగా అమ్మడి స్టైలిష్ లుక్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్.. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది అంటూ.. సూపర్ ఫిగర్ అంటూ.. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటే.. అతి తక్కువ సమయంలోనే తిరుగులేని స్టార్ బ్యూటీగా మారుతుంది అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. కాగా దాదాపు సినిమా రిలీజ్ 22 ఏళ్లు కావడం.. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ అమ్మడి ఫొటోస్ ను చూసిన నెటిజన్స్ కొంతమంది ఆ పాప అక్షరానా అసలు నమ్మలేకపోతున్నాం.. ఇంతలా మారిపోయింది ఏంటి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.