యంగ్ హీరో తండ్రిగా యాంగ్రీ యంగ్ మ్యాన్.. రాజశేఖర్ షాకింగ్ రెమ్యునరేషన్..!

సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ ఒకప్పుడు వ‌రుస సినిమాల‌తో హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా అప‌ట్లో ఆయన నటించిన సినిమాలు, పాత్రలన్నిటిలో ఆవేశంగా ఉండడంతో.. రాజ‌శేఖ‌ర్‌కు యాంగ్రీ యంగ్ మేన్ అనే బిరుదు కూడా వచ్చింది. కాగా కొన్ని సినిమాల తర్వాత ఫ్లాప్స్ ఎదుర్కోవడంతో.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినా రాజశేఖర్ మళ్ళీ చాలా కాలం గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ప‌లు సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలేవి ఊహించిన సక్సెస్ అందుకోలేదు. ఈ క్ర‌మంలోనే సినిమాల్లో కీలక పాత్రలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తన పాత్రకు బలముందనిపిస్తే.. ఎలాంటి చిన్న హీరో సినిమాలో అయినా నటించేందుకు ఒప్పుకుంటున్నాడు.

Rajasekhar is no more an angry young man! - M9.news

అలా గతేడాది నితిన్ హీరోగా వ‌చ్చిన‌ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో ఓ కీల‌క‌ పాత్రలో మెప్పించారు రాజశేఖర్. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు. యాక్షన్ తో పాటు.. తనదైన కామెడీతోను మెప్పించాడు. కానీ.. ఈ సినిమా జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కొంత గ్యాప్ తర్వాత.. మరోసారి ఇంచుమించు అలాంటి సాహ‌సం చేయడానికి సిద్ధమవుతున్నాడు రాజశేఖర్‌. ఇప్పుడు మరో యంగ్‌ హీరోతో సినిమాను నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఆ హీరోకు తండ్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్. శర్వానంద్ సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నారని.. ఆయన తండ్రి పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. మా నాన్న సూపర్ హీరో సినిమాని రూపొందించిన అభిలాష్‌ కంకర డైరెక్షన్లో యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందునుంది.

Dr Rajasekhar to play fiery role in Sharwanand film

ఇక రేసింగ్ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో.. రాజశేఖర్ పాత్ర స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుందని టాక్. ఈ సినిమాకు జానీ టైటిల్ ఫిక్స్ చేయనున్నారట మేకర్స్. అయితే చివరి వరకు అదే టైటిల్ ఉంచుతారా.. లేదా మార్చి టైటిల్ లో అనౌన్స్ చేస్తారా తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. రాజశేఖర్ తండ్రి రోల్ లో చేయడానికి.. ఈ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. పాత్ర డిమాండ్ మేర‌కు ప్రొడ్యూసర్లు కూడా ఆ మొత్తంలో రెమ్యున‌రేష‌న్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇక ఈ సినిమా రాజశేఖర్ కెరీర్‌కు మంచి కమ్ బ్యాక్ ఇవ్వ‌నుంద‌ని టాక్ నడుస్తుంది. ఇటీవల కాలంలో అటు శర్వానంద్‌కు.. ఇటు రాజశేఖర్‌కు ఇద్దరికీ సరైన హిట్ పాడలేదు. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరు నటించనున్న ఈ సినిమా సక్సెస్.. వీరిద్దరికీ చాలా అవసరం. మరి సినిమా తెర‌కెక్కి ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.