కొత్త సినిమా సెట్స్‌లోకి జానీ మాస్టర్.. దిష్టి తీసి, హారతి ఇచ్చి మరి గ్రాండ్ వెల్కమ్.. వీడియో వైరల్

టాలీవుడ్‌ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే.. కొద్దిరోజుల క్రితం లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలు పాలైన సంగతి తెలిసిందే. తర్వాత బెయిల్‌పై జానీ మాస్టర్ బయటకు వచ్చినా చాలాకాలం ఇంటికి పరిమితమయ్యారు. అదే టైంలో కేసులు కారణంగా పుష్ప 2 లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఛాన్స్ జానీ మిస్ చేసుకున్నారు. తాను.. ఏ తప్పు చేయలేదని విచారణలో అన్ని నిజాలు బయటికి వస్తాయి అంటున్న జానీ.. ఇప్పుడిప్పుడే మళ్ళీ తన పనిలో బిజీ అవుతున్నాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా అయన మరో అవకాశాన్ని అందుకున్నాడు.

కన్నడలో రూపొందుతున్న ఓ సినిమాకు జానీ మాస్టర్ పని చేయనున్నాడు. తాజాగా తన కొత్త సినిమా సెట్స్‌కు జానీ మాస్టర్ అడుగుపెట్టాడు. అయితే అక్కడ అతనికి అసలు ఊహించని విధంగా స్వాగతం లభించింది. జానీ మాస్టర్‌కి గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి ఇచ్చి మరి సెట్స్‌లోకి ఆహ్వానించారు టీమ్. అనంతరం కేక్ కట్ చేయించి మరి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం చూసిన జానీ మాస్టర్.. ఎంతో ఎమోషనల్ అయ్యారు. అందరికీ థాంక్స్ చెప్తూ కంటతడి పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.

Yours Sincerely Raam Movie (2025): Release Date, Cast, Ott, Review, Trailer, Story, Box Office Collection – Filmibeat

స్వయంగా వీడియోను జానీ మాస్టర్ షేర్ చేయడం.. చాలా రోజుల తర్వాత బెంగళూరుకు వెళ్లి యువర్ సిన్సియర్లీ రామ్ సెట్స్‌లో అడుగుపెట్టిన నాకు.. ఇంతటి ఘన స్వాగతం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి.. నాకు అవకాశం ఇచ్చిన మా టీం ప్రతి ఒక్కరికి ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట‌ వైరల్ అవడంతో పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్‌తో పాటు.. నెటిజన్లు కూడా జానీ మాస్టర్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ తెలియజేస్తున్నారు. మరిన్ని అవకాశాలు రావాలని.. మరోసారి జాని మాస్ట‌ర్‌కు పూర్వ వైభవం దక్కాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.