ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి.. తర్వాత స్టార్ హీరోలుగా, హీరోయిన్‌లుగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా ఒకటి. ఈ అమ్మడి తండ్రి ఇప్పటికే ఇండస్ట్రీలో దగ్గజ నటుడుగా స్థిరపడ్డాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీ తో పాటు.. బాలీవుడ్‌లోను తన సత్తా చాటుకున్నాడు. దీంతో ఇండస్ట్రీలో అమ్మడికి త్వరగా ఎంట్రీ వచ్చేసింది. తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత హీరోయిన్గా మారి సత్త చాటుకుంది. మరో పక్క సింగర్ గాను తన టాలెంట్‌తో ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే అమ్మడికి మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే.. హీరోయిన్‌గా కెరర్ ప్రారంభంలో పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ఐరన్ లెగ్ అనే విమర్శలను కూడా ఎదుర్కొంది. అయితే అమ్మడికి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమా కావడం విశేషం. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ జాతకం రివర్స్ అయింది. ఇంత చెప్పాం కదా.. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో ఇప్పటికైనా గెస్ చేశారా..? సర్లెండి మేమే చెప్పేస్తాం.. తనే లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్. జనవరి 28న అంటే ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా.. కుటుంబ సభ్యులు, బంధువులు, సినీ ప్రముఖుల అభిమానులు అమ్మడికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే శృతి చిన్ననాటి పిక్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. కాగా తెలుగులో అనకనక ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ అమ్మడు.. పలు సినిమాలో నటించిన ఊహించిన సక్సెస్ అందలేదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శృతి.. తర్వాత బలుపు, వకీల్ సాబ్, శ్రీమంతుడు, క్రాక్, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య , సలార్ పార్ట్ 1 ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటించి గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఎన్నో భారీ ప్రాజెక్టులో ఉండడం విశేషం. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్.. కూలి సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడు.. విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలోను హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఇక సలార్ పార్ట్ 2 తో పాటు.. మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు శృతి చేతిలో ఉన్నాయి.