‘ తండేల్ ‘ వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. చైతు టార్గెట్ ఎంతంటే..?

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా న‌టించిన‌ తాజా మూవీ తండెల్. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెర‌కెక్కనున్న ఈ సినిమాను.. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య సినీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. గీతా సంస్థ ఫ్యామిలీ హీరోలపై కాకుండా ఇంత రేంజ్ లో ఖర్చుపెట్టి తెర‌కెక్కిస్తున్న మొదటి సినిమా ఇదే కావ‌డం విశేషం. అది కూడా వరుస ప్లాపులతో కూరుకుపోయిన నాగచైతన్య లాంటి హీరోతో తీసిన సినిమా తండేల్ కావడంతో.. ఈ సినిమా కంటెంట్ పై మేకర్స్ లో ఎలాంటి నమ్మకం ఉందో క్లియర్ గా అర్థమవుతుంది.

Thandel sets a date for its trailer launch | Telugu Cinema

ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో మరింత హైప్ నెలకొంది. అయితే ఈ రేంజ్‌లో ఖర్చు చేయడానికి థియేట్రికల్ ఆదాయంపై మేకర్స్ ఆధారపడాల్సి వచ్చిందని సమాచారం. కాగా సినిమాకు నాన్ థియెట్రిక‌ల్, డిజిటల్, హిందీ ఆడియో హ‌క్కుల‌న్ని కలుపుకొని ఇప్పటివరకు రూ.50 కోట్ల మేర బ‌చ్చేసాయ‌ని టాక్‌. అంటే దాదాపు సగానికి పైగా ఇప్పటికే రికవరీ అయిపోయింది. అయితే ఇప్పుడు థియేటర్ల‌పై రూ.35 కోట్లు రాబట్టాల్సి ఉండగా.. గీత స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేసి కొంత మేరా రికవరీ సాధించాలని భావిస్తుంది. ప్రస్తుతం చైతన్య మార్కెట్ బాగా డౌన్‌లో ఉన్న క్రమంలో.. ఎక్కువ రేట్లకు సినిమాను అమ్మడం అసలు కుదరదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇప్పటికే కొన్ని ఏరియాలో రూ.15 కోట్లకు సినిమాను కొనుగోలు చేసినట్లు సమాచారం.

సీడెడ్‌లో రూ.4.5 కోట్లకు అమ్ముడుపోయింది. నైజాంలో మేకర్స్.. సొంతంగా భారీ ఎత్తున రిలీజ్ చేసుకుంటున్నారు. నైజం, ఏపీలో కలిపి కనీసం రూ.35 కోట్ల మేర రాబట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఓవర్సీస్, ఇతర భాషల హక్కులతో కలిపి బ్రేక్ ఈవెన్ సాధించగలుగుతారు. ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న గ్రాండ్గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాకు చైతన్యతో పాటు.. సాయి పల్లవి కూడా హైలెట్గా నిలవనుంది. ఇప్పటికే ఈ కాంబోలో లవ్ స్టోరీ మూవీ వ‌చ్చి బ్లాక్ బ‌స్టర్‌గా నిలవడంతో పాటు.. సాయిప‌ల్ల‌వికి తెలుగులో విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఈ నేప‌ద్యంలో మరోసారి ఈ లక్కీ కాంబోలో అదే మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.