ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్‌ల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఎన్టీఆర్, చరణ్ కాంబోలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక తారక్ ప్రస్తుతం మరోసారి హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2తో బాలీవుడ్ బిగెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఓ భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. గతంలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో జవాన్ సినిమా తెరకెక్కించి బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు. కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఈ క్రమంలోని అట్లీ నెక్స్ట్ మూవీ ఏంటని.. ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే అట్లీ నెక్స్ట్ మూవీ కూడా షారుఖ్ ఖాన్‌తో ఉండనిందని వార్తలు వినిపించినా అది వర్కౌట్ కాలేదట. ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ హీరోలతో భారీ మల్టీ స్టార్లర్ ప్లాన్ చేస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్ కాంబోలో ఆ మూవీ రూపొందించేలా అట్లీ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఆడియన్స్ లో అనౌన్స్మెంట్ తోనే విపరీతమైన బజ్ నెలకొంటుంది అనడంలో సందేహం లేదు.
ఇక అట్లీ గతంలో ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం తాను స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నానని.. ఈ సినిమాలో స్టార్లను చూసి అంత ఆశ్చర్యపోతారు.. అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఐడియాతో సినిమా రూపొందనుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే అప్పుడు అట్లి చెప్పిన మల్టీ స్టారర్ ఇదే అంటూ వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. ఇక అట్లీ కామెంట్లను బట్టి మల్టీస్టారర్‌ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడని క్లియర్ గా తెలుస్తోంది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమాల్లో నటిస్తుండగా.. మరోపక్క సల్మాన్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ మురగదాస్‌తో సికిందర్ సినిమాలో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అట్లీ మల్టీస్టారర్ నిజమైతే కనుక.. రజనీ, సల్మాన్ ఇద్దరూ తమ కమిట్మెంట్లు పూర్తి చేసుకున్నవెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది.