పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక రాజకీయాలోను తనదైన ముద్ర వేసుకొని ఏపీ డిప్యూటీ సీఎంగా విధుల నిర్వర్తిస్తున్న బిజీగా ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత బిజీ స్కెడ్యూల్‌లోను పవన్ తన సినిమాల పరంగా మరోసారి సత్త చాటుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగా కొద్దిరోజులుగా హరిహర వీరమల్లు సినిమా షూట్‌లో పవన్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఔరంగజేబ్ క్యారెక్టర్‌లో బాబి డియోల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇక ఆ పోస్టర్ కు అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుంది. అలా సినిమాపై మరోసారి భార్యా అంచనాలు నెలకొన్నాయి. ఏదేమైనా.. సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ కొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు.. మేకర్స్ కూడా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్‌కు సక్సెస్ కాయమంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల ఈ మూవీనుంచి వచ్చిన ఓ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోస్ ఉన్నప్పటికీ.. పవన్ కళ్యాణ్‌ను మాత్రం ఎవరు టచ్ చేయలేకపోతున్నారు.
పవన్‌కు ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా.. ఆయనకు ఉన్న మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం కాస్త కూడా తగ్గడం లేదంటేనే.. ప్రేక్షకుల్లో ఆయనపై ఉన్న అభిమానం అర్ధమవుతుంది. ఈ క్రమంలోనే అయినా నటిస్తున్న సినిమాలు ఇప్పటికీ మంచి కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. కాగా.. పొలిటికల్‌గా బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్.. సినిమాలకు టైం కేటాయించడానికి కారణం కూడా అభిమానులేనని.. అభిమానులు తనపై పెట్టుకున్న ప్రేమాభిమానాల కారణం అని.. సినిమాలు మొత్తానికే చేయకుండా వదిలేస్తే అభిమానులు ఒప్పుకోరనే ఒకే ఒక్క ఉద్దేశంతో వాళ్లను ఎంటర్టైన్ చేసేందుకు ఇప్పటికీ ఆయన సినిమాలు తీస్తున్నట్లు ఎన్నో సందర్భాల్లో వెల్లడించాడు. ఇక ఫ్యూచర్‌లోను ఇలాగే సినిమాల్లో నటిస్తూ పవన్ ప్రేక్షకులను మెప్పిస్తాడా.. లేదా సినిమాలకు గుడ్ బై చెప్పేసి పాలిటిక్స్‌కి పరిమితం అవుతాడో వేచి చూడాలి.