టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా మూవీ SSMB 29. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడంతో.. ఆడియన్స్‌లో ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను జక్కన్న యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్, ప్రియాంక చోప్రా నటిస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఇక దాని తర్వాత సినిమాకు సంబంధించిన మరే చిన్న అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి క్రమంలోనే రాజమౌళి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. మహేష్ పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకున్నట్లు క్లారిటీ వచ్చేలా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. దీంతో ఇన్ డైరెక్ట్‌గా మహిష్‌తో షూటింగ్ ప్రారంభించినట్లు హింట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కనుందని టాక్. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క చిన్న సమాచారం కూడా బయటకి లీక్ కాకూడదని.. జక్కన్న పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో భాగంగానే టఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటూ టీంకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట.
ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్‌లతో సహా.. యూనిట్ అంతా ఈ హెచ్చరికలు వర్తిస్తాయని సమాచారం. నాన్ డిస్క్ క్లోజ్ అగ్రిమెంట్ అందరితోనూ చేయించినట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ అగ్రిమెంట్ అర్థం.. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ విషయాన్ని బయటకు లిక్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా లీక్ చేసినట్లు సాక్ష్యాలు దొరికితే వారు దానికి భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని. అంతేకాదు ఎవరైతే సెట్స్‌లో అడుగు పెడతారో.. వాళ్ళు ఎవరు ఫోన్లను వాడకూడదని జక్కన్న స్ట్రీక్ట్ కండిషన్ పెట్టాడట. ఈ నిబంధనలు మహేష్‌తో సహా.. అందరికీ వర్తిస్తాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ను అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్స్‌లో జరుపుతున్నట్లు సమాచారం.