సంక్రాంతి అంటేనే టాలీవుడ్‌కు పెద్ద పండుగ. ఈ క్రమంలోనే చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. అలా ఈ ఏడాది వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య.. డాకుమారాజ్, రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ సినిమాలతో రంగంలోకి దిగారు. అయితే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్‌గా నిలవగా.. బాలయ్య డాకు మహారాజ్ పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఒక గేమ్ ఛేంజర్ మాత్రమే.. ఆడియన్స్‌ను నిరాశపరిచి.. నిర్మాతలకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇలాంటి క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాలైనప్ గురించి.. నెటింట వార్తలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద మరింత భారీ పోటీ నెలకొననుందని సమాచారం.
అలా 2026 జనవరిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఇళయ దళపతి విజయ్‌తో పోటీకి సిద్ధమవుతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నాడు. ఇక ఈ సినిమాకు ” డ్రాగెన్ ” టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనవరిలో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరోపక్క కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి 69వ సినిమాలో నటిస్తున్నాడు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి ” జన నాయగన్ ” అనే టైటిల్ ఫిక్స్ అయింది. తాజాగా టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇది బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు.. రీమిక్స్‌గా రానుంది.
కొంత మార్పులతో రాజకీయ నేపథ్యం ప్రస్తావించి.. తమదైన స్టైల్‌లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది. అయితే విజయ్ దళపతి ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ క్రమంలోనే దళపతి 69 పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఈ రెండు సినిమాలతో పాటు.. 2026 సంక్రాంతి బరిలో మరిన్ని పెద్ద సినిమాలు పోటీ పడవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా.. విజయ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్నాయా.. లేదా ప్రాంతీయ స్థాయిలో విడుదల చేస్తారా.. అనేది వేచి చూడాలి. ఒకవేళ ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొంటుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు.. సంక్రాంతి బరిలో మరిన్ని సినిమాలు పోటీకి సిద్ధమవుతాయో తెలియాలంటే.. కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.