టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అనిల్.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి సినిమా కలెక్షన్ల పరంగా భారీ ప్రాఫిట్ సంపాదిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో అనిల్ తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. భార్యా భర్తల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ తెరపై ఎంతో అద్భుతంగా చూపిస్తూ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించాడు.
ఈ సంక్రాంతి పండగకి ఫుల్ మీల్స్ లాంటి సినిమా అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే అనిల్ తన నెక్స్ట్ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. పరోక్షంగా అనిల్ రావిపూడి కూడా దీనిని కన్ఫామ్ చేసేసాడు. ఇలాంటి నేపథ్యంలో అనిల్ రావిపూడి.. మా అభిమాన హీరోతో సినిమా కచ్చితంగా చేయాలంటూ ఓ స్టార్ హీరో ఫ్యాన్స్ డిమాండ్లు మొదలుపెట్టారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా బడా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు.
క్షణం తీరిక లేకుండా వరుస యాక్షన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ప్రభాస్‌తో అనిల్ రావిపూడి ఓ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనను తెరకెక్కించాలని రెబల్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్ ని పాన్ ఇండియా లెవెల్ లో మాస్‌గా చూసి రొటీన్ అయిపోయిందని.. ఫ్యామిలీ గెటప్‌లో చూడాలనుకుంటున్నాం అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అనిల్, ప్రభాస్ కాంబోలో సినిమా అంటే టాలీవుడ్ దగ్గర రికార్డులు బ్రేక్ అవ్వడం కాయం. మరి.. ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్‌ని అనిల్ రావిపూడి ఎప్పటికి నెరవేరుస్తాడో.. ప్రభాస్‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టు ఫ్యామిలీ పర్సన్‌గా చూపించి కడుపుబ్బా నవ్విస్తాడో.. లేదో.. వేచి చూడాలి.