ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఎంతోమంది ముద్దుగుమ్మలు సినీ కెరియర్‌తో పాటు.. వైవాహిక జీవితానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మ్యారీడ్ లైఫ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సీనియర్ స్టార్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి వైపు ద్యాస మళ్లించకుండా కేవలం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అలాంటి వారిలో ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మ శోభన కూడా ఒకటి. ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఆమె వివాహానికి దూరంగానే ఉంటుంది. ఇక కొద్దిరోజుల క్రితం టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కల్కీలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అఖండ 2 లోను కీ రోల్ కోసం ఈ అమ్మడు నటించనుందని సమాచారం. ఇక తాజాగా హీరోయిన్ శోభన.. మలయాళ ఇండస్ట్రీ నుంచి పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమ్మడికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు వైరెల్ అవుతున్నాయి. అలా 54 ఏళ్లు దాటిన ఇప్పటికీ శోభన వివాహం చేసుకోకపోవడానికి కారణం కూడా వైరల్‌గా మారింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభన తాను పెళ్లి చేసుకోవడానికి కారణాన్ని స్వయంగా వెల్లడించిందట. శోభన 1970 మార్చి 21న కేరళ తిరువనంతపురంలో జన్మించింది. ఇక 1980లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంగళనాయకి సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించిన శోభన.. 1984లో కమల్ హాసన్ కు జోడిగా మదుల్ ఓరువన్ సినిమా ద్వారా హీరోయిన్గా మారింది.
ఈ సినిమా తర్వాత రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున లాంటి ఎంతో మంది స్టార్ హీరోలతో ఆడి పాడింది. సుమారు 200 పైగా సినిమాల్లో నటించినా శోభనను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్తో పురస్కరించింది. ఇప్పుడు మరోసారి తాజాగా పద్మభూషణ్ అవార్డును దక్కించుకుంది. ఈ క్రమంలోనే శోభన పేరు తెగ వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా శోభన ఇప్పటివరకు వివాహం చేసుకోక పోవడానికి కారణం తనకు వివాహ బంధం మీద నమ్మకం లేకపోవడమేనని.. పెళ్లి చేసుకుంటే తన వ్యక్తిగత స్వేచ్ఛను కూడా కోల్పోవాల్సి వస్తుందని ఉద్దేశంతోనే ఆమె పెళ్లి చేసుకోలేదని.. తను స్వయంగా వెల్లడించిందట. అందుకే ఆమెకు ఇప్పటివరకు పెళ్లిపై ధ్యాస రాలేదని.. అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చిందట. ఇక ప్రస్తుతం సినిమాల్లో మంచి పాత్రలతో రీ ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న ఈ అమ్మడు.. రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్రలో నటించే ఆడియన్స్‌ను మెప్పిస్తుందో వేచి చూడాలి.