నందమూరి నటసింభం బాలయ్య తాజాగా నటించిన మూవీ డాకు మహరాజ్. సంక్రాంతి కనుకగా రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ బాబికొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్యూర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా వచ్చి మెప్పించింది. ఈ సినిమాలో బాలయ్య నటనకు ఆడియన్స్ అంతా ఫిదా అయ్యారు ట్యూయల్ రోల్‌లో తన నటనను బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు బాలయ్య. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచలేదు ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్డేట్‌పై నెటింట ఓ వార్త తెగ వైరల్‌గా మారుతుంది. డాకు మహారాజ్ సినిమా ఓటీటీ రైట్స్ ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమాను ఫిబ్రవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా.. చాందిని చౌదరి, ఊర్వశి రౌతెలా, బాబి డియోల్ తదితరులు కీలకపాత్రలో మెప్పించారు.
థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను.. సీతారా ఎంటర్టైన్మెంట్, ఫర్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న బాలయ్యకు.. ప్రస్తుతం శుక్ర మహార్దశ నడుస్తున్నట్టు ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలకు గాను, రాజకీయంగా ప్రజలకు చేసిన సేవకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ అవార్డ్ దక్కింది. ఇక బాలయ్య ప్రస్తుతం తన లక్కీ డైరెక్టర్ బోయపాటితో నాలుగో సినిమాకు సిద్ధమయ్యాడు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా అఖండ 2 తాండవంలో నటిస్తూ బిజీగా గడుపనున్నాడు బాలయ్య.