టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్నో అవమానాలను ఎదుర్కొని స్ట్రాంగ్‌గా నిలబడి సక్సెస్‌లు అందుకుని రాణిస్తున్నాడు. ఇదంతా ఒక లెక్క అయితే.. పవన్ తన వ్యక్తిగత లైఫ్‌లోను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. స్టార్ హీరో కాకముందే నందిని అనే వైజాగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్.. స్టార్‌డం వచ్చిన తర్వాత ఆమెతో విభేదాలు కారణంగా విడాకులు ఇచ్చేశాడు.
తర్వాత బద్రి సినిమా చేసే టైంలో హీరోయిన్ రేణు దేశాయ్‌తో ప్రేమలో పడి ఆమెతో లివింగ్ రిలేషన్‌షిప్ తర్వాత 2009లో రెండవ వివాహం చేసుకున్నాడు. తర్వాత వీళ్ళిద్దరికీ కూడా డివోర్స్ అయింది. ఇక రష్యన్ గర్ల్ అన్న లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్న పవన్.. ప్రస్తుతం ఆమెతో మ్యారీడ్ లైఫ్ ను గడుపుతున్నాడు. అయితే తాజాగా సీనియర్ డైరెక్టర్ గీత కృష్ణ.. బద్రి సినిమా టైంలో జరిగిన సంఘటనను వివరించారు. డైరెక్టర్ గీత కృష్ణ మొదట రేణు దేశాయ్‌ని మోడల్గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు. కానీ.. గీత కృష్ణ సినిమా ఆలస్యం కావడంతో.. ప్రభుదేవా డైరెక్షన్లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రేణు.
గీత కృష్ణ మూవీ ఆగిపోయింది. ఈ క్రమంలోనే బద్రి హీరోయిన్గా నటించింది. షూటింగ్ టైంలో పవన్‌తో ప్రేమలో పడి ఆయనను వివహం చేసుకోవడం అందరికీ తెలుసు. కానీ నిజానికి రేణు దేశాయ్ కంటే ముందే.. అమీషా పటేల్‌ని పవన్ ప్రేమించాడనే సంచలన నిజాలను గీత కృష్ణ రివీల్ చేశాడు. ఆ టైంలో అమీషా పటేల్ కూడా పవన్ క్రేజ్ చూసి ఫిదా అయిందట. ఇద్దరూ చట్టపట్టలేసుకొని తిరిగే వారిని.. అప్పట్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని టాలీవుడ్‌లో టాక్ నడిచింది అంటూ వెల్లడించాడు. కట్ చేస్తే చివరకు రేణు దేశాయ్‌తో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నాడు.