టాలీవుడ్‌లొ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సమంత.. ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. మూవీ విషయం పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. స్టార్ హీరోయినైనా.. అవమానాలు, మాటలు మాత్రం సమంతకు తప్పడం లేదు. తాజాగా సమంత మాజీ భర్త చైతన్య రెండో వివాహం చేసుకోవడంతో ఆమెను మరింతగా హైలెట్ చేస్తున్నారు. కానీ.. అవి ఏమీ పట్టించుకోకుండా సమంత తనను తాను చూసుకుంటూ కెరీర్‌పై దృష్టి పెడుతుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. పలు షోలలో పాల్గొంటూ సందడి చేస్తుంది.
తనకు తోచిన మంచి మాటలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా విడాకులు తీసుకున్న ఓ స్త్రీ సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా అంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేసింది. విడాకులు తీసుకున్న అమ్మాయిని ఈ సమాజం ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు. చాలా ఏళ్ళు నేను దీంతో జీవించా. నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టాయి. చాలాసార్లు వాటిలో ఏం నిజం లేదని చెప్పాలనిపించింది. కానీ.. నన్ను ఆపింది ఏంటంటే.. నేనే అంటూ వివరించింది. నాతో నేనే సంభాషణ చేసుకునేదాని ఒకరి గురించి, వాళ్ళ జీవితం గురించి తప్పుడు కథలు చెప్పాలని మీకు చాలా ఉత్సాహం ఉండొచ్చు.. కానీ దాని నుండి ఏమి పొందుతారు.. అప్పటివరకు మీకది ఆనందం ఇస్తుండొచ్చు.. ఆ తర్వాత మీరు ఎంత తెలివితక్కువ పని చేశారో మీకే తెలుస్తుంది అప్పుడు మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటారు అంటూ వివరించింది.
అయితే ఒకటి మాత్రం నేను కచ్చితంగా చెప్పగలనని.. విడాకులు తీసుకోవడం వల్ల మొదట బాధగా అనిపించింది. నా చుట్టూ ముందులా ఏదీ లేదు.. అంతా మారిపోయింది.. అలా అని నేను మూలాన కూర్చుని ఏడుస్తూ ధైర్యం కోల్పోలేదు అంటూ వివరించింది. ఇంతటితో నా లైఫ్ ఏండ్ కాలేదు. ఇప్పటినుంచి జర్నీ మరోసారి మొదలవుతుంది. ప్రజెంట్ నేను సంతోషంగా ఉన్నా. మంచి వ్యక్తులతో పనిచేస్తూ బిజీగా గడుపుతున్నా. నా లైఫ్ నెక్స్ట్ అధ్యయనం కోసం ఎదురుచూస్తున్నా అంటూ సమంత వివరించింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ నెటింట వైరల్ అవడంతో ఆమె ఇన్ని రోజులుగా ఎంత క్షోభను అనుభవించిందో అర్థమవుతుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.