ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్న నేపథ్యంలో.. తెలుగు సినిమా సీక్వెన్స్‌ను కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆరాటపడుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే మొదటి పార్ట్‌తో సక్సెస్ అందుకున్న ఎన్నో సినిమాల సీక్వెల్స్.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు టాలీవుడ్‌లో అలా రిలీజ్ అయిన సిక్వెన్స్ బాహుబలి 2, పుష్ప 2 బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే తెలుగులో ఓ సినిమా రిలీజై హిట్ అయిన తర్వాత సీక్వెన్స్ లపై ఆడియన్స్ లో విపరీతమైన హైప్ నెలకొంటుంది.
కలెక్షన్ల వర్షం కురుస్తుంది. దీంతో నిర్మాతలు కూడా సీక్వెల్స్ పై ఆసక్తి చూపుతున్నారు. ఫస్ట్ పార్ట్ ముగిసిన దగ్గర నుంచి.. కంటిన్యూషన్‌గా సెకండ్ పార్ట్‌ను క్రియేటివ్‌గా తెరకెక్కించడంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం సీక్వెల్స్ దిశగా అడుగులు వేస్తుండడం విశేషం. ఇక ఇప్పుడు పుష్ప 2 కొనసాగింపుగా పుష్ప 3 రానుందట. అంతేకాదు ఎన్టీఆర్ దేవర బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. సినిమా సీక్వెల్ త్వరలో రానుంది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలకు కూడా సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.
ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకపోయినా.. సినిమా బ్లాక్ బస్టర్ కావడం ప్రస్తుతం నార్త్‌లోను బాలయ్య కి మంచి ఇమేజ్ క్రియేట్ అవ్వడంతో అఖడ 2 కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాల దిశగా అడుగులు వేస్తున్నారు. సీక్వెన్స్ సినిమాల బిజినెస్ విషయంలో కూడా సంచలనాలు సృష్టిస్తున్న క్రమంలో.. టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్‌ను సీక్వెన్స్‌లు మరింతగా పెంచే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోలు సరైన ప్రాజెక్టులను ఎంచుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. రికార్డులు బ్లాస్ట్ అవ్వడం ఖాయం అనడంలో ఎలాంటి సందేహాలు.