టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కాంబోలలో నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో కూడా ఒకటి. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుందంటే ఆడియన్స్ లో మాస్ వైబ్ పిక్స్ లెవెల్‌లో ఉంటుంది. ఇక బాలయ్యను మాస్‌గా ఎలివేట్ చేయడంలో తన తర్వాతే ఇంకెవరైనా అనే రేంజ్ లో బోయపాటి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు కాంబోలో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా.. అఖండ 2 తాండవం రూపొందుతుంది. ఇక మరోసారి బాలయ్యను పవర్ఫుల్ అఘోర పాత్రలో చూసేందుకు ఫ్యాన్స్ తో పాటు ఎంతో మంది ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న టీం.. త్వరలోనే సినిమా షూట్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
వచ్చే నెల రెండో వారం నుంచి బాలయ్య పై రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని సన్నివేశాలు తీయనన్నట్టు సమాచారం. ఆఘోర పాత్రకు సంబంధించిన ఎంట్రీ సీన్స్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ బచ్చేలా ప్లాన్ చేశాడట బోయపాటి. దానికి సంబంధించిన సెట్స్ పనులు కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ లో ఉన్న బోయపాటి.. సినిమా కాస్టింగ్ విషయంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అలా ఇప్పటికే చాలా వరకు కీలక పాత్రలు, స్పెషల్ రోల్స్ కోసం నటీనటులను ఫిక్స్ అయ్యారట. మరికొంత సెలక్షన్ మిగిలి ఉంది. కాగా.. ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్ పై.. రామ్ అచంట, గోపి ఆచంట ప్రొడ్యూసర్లుగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఇక సినిమాకు బాలయ్య లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించనున్నాడు. ఇక థమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్యను ఎలివేట్ చేసే సమయంలో థమన్ ఇచ్చే బిజీయంకు స్పీకర్లను బ్లాస్ట్ అయ్యిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే మరోసారి బాలయ్య, బోయపాటి, థమన్ ఈ ముగ్గురి హ్యాట్రిక్ కాంబో రిపీట్ అవుతుండడంతో.. సినిమాపై ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పూర్తై.. రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.