నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఖండతో మొదలైన బాలయ్య సక్సెస్ ట్రాక్ ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్‌తో బాలయ్య వరుసగా సక్సెస్‌లో అందుకుంటూ రాణిస్తున్నాడు. ఓ పక్కన సినిమాలతో పాటు.. మరో పక్కన రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలో రాజకీయాల పరంగా అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌తో ప్రజలకు అందించిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్నాడు.
అలాంటి బాలయ్యకు సంబంధించిన వైరల్‌గా మారుతుంది. బాలయ్య ఇప్పటికైనా సినీ కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో నటించారు. విజయశాంతి, సిమ్రాన్, ప్రగ్యా జైశ్వాల్, రాధిక ఆప్టే లాంటి హీరోయిన్లతో అయితే రిపీట్ సినిమాల్లో కనిపించారు. అయితే బాలయ్య సినీ కెరీర్‌లో ఎంతమంది హీరోయిన్లతో నటించినా.. ప్రతి ఒక్కరు ఆయనను ఎంత గౌరవిస్తూ ఉంటారు. అసలు ఇబ్బంది పెట్టలేరు. కానీ.. ఆయన కెరీర్‌లో ఓ స్టార్ హీరోయిన్ మాత్రం చాలా ఇబ్బంది పెట్టిందని.. ఓ స్టార్ ప్రొడ్యూసర్ వెల్లడించాడు. వీరభద్ర సినిమా షూట్ టైంలో హీరోయిన్ తను శ్రీ దత్త బాలయ్యను ఇబ్బంది పెట్టిందని వెల్లడించాడు.
ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతున్న క్రమంలో తండ్రికి ఆరోగ్యం సరిగా లేదు.. నేను వెంటనే ఇండియాకి వెళ్లిపోవాలని.. షూటింగ్ డుమ్మ కొట్టేసి వెళ్లిపోవాలని ఫిక్స్ అయిందట. అయితే.. ఎంతసేపు వెయిట్ చేసినా షూటింగ్‌కు రాకపోవడంతో బాలయ్యతో పాటు.. మిగిలిన నటీనటులు కూడా ఇబ్బంది పడ్డారు. ఇక చేసేదేమీ లేక.. ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ.. తను శ్రీ దగ్గరకు వెళ్లి మీరు షూటింగ్‌కి రాకపోతే మాకు చాలా నష్టం వచ్చేస్తుంది. బాలయ్యతో పాటు.. మిగతా సెలబ్రిటీలకు కాల్ షీట్లు కూడా వేస్ట్ అవుతాయి. దయచేసి షూటింగ్ రమ్మని బుజ్జగించాడట. దాంతో తిరిగి షూటింగ్ కి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇలా అంబిక కృష్ణ స్వయంగా ఇంటర్వ్యూలో.. తనుశ్రీ కారణంగా బాలయ్య తో పాటు ఇతర సిబ్బంది అంతా ఇబ్బందులు పడినట్లు గుర్తు చేసుకున్నాడు.