అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్. కార్తికేయ ఫ్రేమ్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా కనిపించనుంది. ఇక సాయి పల్లవి, చైతన్య కాంబో టిలీవుడ్ క్రేజీ కాంబో అనడంలో సందేహం లేదు. గతంలో వీరిద్దరు కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ఇప్పటికే ఈ కాంబోపై ఆడియన్స్ లో మంచి అంచనాల నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే గీత ఆర్ట్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందించారు. చైతు కెరీర్‌లోనే ఒక్కింత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.35 కోట్ల మేర కలెక్షన్లు కొల్లగొడితే.. సినిమా హిట్ అవడం ఖాయం అని సమాచారం.
ఇక ఫిబ్రవరి 7న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు గట్టి పోటీ కూడా లేకపోవడంతో మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాగా.. ఇలాంటి నెపద్యంలో సినిమా ఫస్ట్ రివ్యూ వైరల్‌గా మారుతుంది. సినిమాను చూసిన తర్వాత ప్రొడ్యూసర్ అరవింద్ ఇచ్చిన రియాక్షన్ ట్విట్టర్ వేదికగా బన్నీవాస్ షేర్ చేసుకున్నాడు. సినిమాను అల్లు యూనివర్స్ కీ పర్సన్ అల్లు అరవింద్ సర్టిఫై చేశారని.. డిస్టెన్షన్ మార్కులు వేశారని.. 100కు 100% మార్కులు పడ్డాయి అంటూ బన్నీ వాస్ చెప్పుకొచ్చాడు.
ఇక సినిమా దుల్లగొట్టడం కాయం.. బాక్స్ ఆఫీస్ దగ్గర రాజులమ్మ జాతరే అంటూ శ్రీకాకుళం యాసలో వెల్లడించాడు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్ లో మరింత అంచనాలు పెరిగాయి. అల్లు అరవింద్ సాధారణంగా ఓ సినిమా బడ్జెట్ పెట్టడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటిది తన కెరీర్‌లోనే ఒక్కింత భారీ బడ్జెట్‌లో సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇక బన్నీవాస్ చెప్పినట్టు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుందో లేదో.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.