ఎప్పటినుంచో ఆ హీరోయిన్‌తో పనిచేయాలని వెయిట్ చేస్తున్న వెంకటేష్.. ఆ లక్కీ బ్యూటీ ఎవరంటే..?

ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న చాలా మంది.. తనకంటే పెద్ద స్టార్ హీరోలు లేదా హీరోయిన్లతో నటించాలని ఆశపడుతూ ఉంటారు. అది సర్వసాధారణం. ఎక్కువగా హీరోయిన్లు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అదే తమ డ్రీమ్ అని చెబుతూ ఉంటారు. అంతేకాదు ఆ హీరోలతో సినిమాలు చేయడం వల్ల వారి ఇమేజ్ కూడా మరింతగా పెరుగుతుందని ఆరాట‌ప‌డ‌తారు. అలాంటిది సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వెంకటేష్ మాత్రం వీళ్ళందరికీ పూర్తి భిన్నంగా త‌న అభిప్రాయాని వ్య‌క్తం చేశాడు.

Keerthy Suresh on Mahanati: Savitri's personal life is 80 per cent of her  biopic

తాజాగా వెంకటేష్ నుంచి వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా.. ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో జనవరి 14న గ్రాండ్‌గా రిలీజైన‌ ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. ఇప్పటికీ మంచి కలెక్షన్ కొల్లగొడుతూనే ఉంది. ఈ నేప‌ద్యంలో ఓ యంగ్ హీరోయిన్‌తో సినిమా చేయాలని ఉందంటూ వెంకటేష్ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ ఆ లక్కీ బ్యూటీ ఎవరో చెప్ప‌లేదు క‌దా.. త‌నే టాలీవుడ్ మహానటిగా క్రేజ్‌ సంపాదించుకున్న కీర్తి సురేష్. న‌మ్మ‌బ‌ద్ధి కాకున్నా ఇదే నిజం.

teluguone | Photos

విక్టరీ వెంకటేష్ ఎప్పటినుంచో కీర్తి సురేష్ తో కలిసి పనిచేయాలని ఆశపడుతున్నాడట. కీర్తి సురేష్ సావిత్రి బయోపిక్.. మహానటిలో తన అందం, అభినయంతో పాటు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోను ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే అమ్మడితో ఒక్కసారి అయినా సినిమా చేయాలని.. స్క్రీన్ షేర్ చేసుకోవాలని వెంకటేష్ భావిస్తున్నాడట. మరి వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఫూచ‌ర్లో వస్తుందో.. లేదో.. వీళ్ళిద్దరికీ తగ్గ క‌థ టాలీవుడ్‌లో డైరెక్టర్స్ రాసుకుని సెట్స్‌ వరకు తీసుకువస్తారో.. లేదో.. తెలియాలంటే వేచి చూడాల్సిందే. అయితే వెంకటేష్ కోరికను విన్న అభిమానులు మాత్రం వీళ్ళిద్దరి కాంబోలో నిజంగానే ఒక సినిమా వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.