సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెలబ్రెటీలుగా మారిన తర్వాత.. వారికి సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా.. నెటింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గుట్టుచప్పుడు కాకుండా ఎన్ని జరిగిన ఇబ్బంది ఉండదు కానీ.. ఒక్కసారి సమస్యలు, కుటుంబ కలహాలు వీధిలోకి వచ్చాయంటే.. ఫిలింనగర్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతాయి. అలా.. టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఓ దర్శకుడి పర్సనల్ లైఫ్.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌లో ఒకడు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ ఫిలిం తోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆయన రూపొందించిన సినిమాలలో మల్టీ స్టారర్ కూడా ఉంది.
మొదట సక్సెస్‌లు అందుకున్న ఈ డైరెక్టర్.. మెల్లమెల్లగా సినిమాలు డిజాస్టర్ కావడంతో ఫేడౌట్ దశకు చేరుకున్నాడు. అయితే ఇప్పటికీ ఆయనకు ఇండస్ట్రీలో మాత్రం మంచి ఇమేజ్ ఉంది. ఫ్లాప్ లో ఉన్నప్పటికి ఎంతోమంది ఆయనను అభిమానిస్తూనే ఉన్నారు. తీసిన సినిమాలు చాలా తక్కువ అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆ డైరెక్టర్.. ఇప్పుడు ఎఫైర్ న్యూస్ కారణంగా విమర్శల పాలవుతున్నాడు. తమిళ్ హీరోయిన్ తో డైరెక్టర్‌కు ఎఫైర్ ఉందని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నైలో అమ్మాయి ఎక్కడ ఉంటే ఆ దర్శకుడు కూడా అక్కడే కనిపిస్తున్నాడు. భార్యను పూర్తిగా వదిలేసి.. కుటుంబ గొడవలతో సతమతమవుతున్నాడట. ఇప్పుడు అతని కెరీర్ కూడా డోలాయమానా పరిస్థితి నెలకొందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కొద్ది రోజుల క్రితమే ఓ సినిమా తెరకెక్కించిన ఆ డైరెక్టర్.. సినిమాల్లో ఓ పాత్రలోను నటించాడు. అయితే పార్ట్ 2 అనౌన్స్ చేసిన ఫస్ట్ బాగం ప్లాప్ కావడంతో సెకండ్ పార్ట్ రాలేదు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రాణిస్తున్న మన హీరోస్ ఆయనకు అవకాశాలు ఇవ్వడం కూడా కష్టమే. ఈ క్రమంలోనే ప్రొఫెషనల్ లైఫ్‌తో సతమతమవుతున్న ఆయన.. పర్సనల్ లైఫ్‌లోను గందరగోళాని ఎదుర్కొంటున్నాడు. ఓ పక్కన తన భర్త ఆమెకు కాకుండా పోతున్నాడని భార్య ఆవేదన చెందుతుందని.. ఇక ఆ తమిళ నటికి కూడా టాలీవుడ్‌లో అవకాశాలు రావడంలేదని సమాచారం. దర్శకుడుతో ఎఫైర్ వార్తలు వైరల్ అవ్వడంతోనే.. ఆ తమిళ్ బ్యూటీ కి కూడా అవకాశాలు తగ్గించేసారట. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్యన ఎఫైర్ ఇంకెని సమస్యలకు దారితీస్తుందో అంటూ ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్‌గా న్యూస్ ట్రెండ్ అవుతుంది.