ఆ డైరెక్టర్‌తో సినిమానా.. వద్దు బాబోయ్ వద్దు తారక్ ను రిక్వెస్ట్ చేస్తున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు. తను న‌టించిన‌ ప్రతి సినిమాతో అంతకంతకు మార్కెట్‌ను పెంచుకుంటూ పోతున్న తారక్.. భవిష్య సినిమాలోని రూ.300 నుంచి రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపంతుండడం విశేషం. అయితే తార‌క్ తన సినీ కెరీర్‌లో ఎంతగానో అభిమానించే దర్శకల్లో వెట్రిమారన్‌ కూడా ఒకరు. గతంలో వెట్రిమార‌న్ డైరెక్షన్‌ ఓ సినిమా చేయాలని ఉందంటూ ఎన్టీఆర్ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసింది. అయితే ఇటీవల కాలంలో ఆయ‌న‌ డైరెక్షన్లో వ‌చ్చిన సినిమాలేవి ఊహించిన రేంజ్ లో రిజల్ట్ సాధించడం లేదు.

RRR Star Jr NTR to Collab with Tamil Director Vetrimaran? | LatestLY

అంతేకాదు.. ఆయన స్వయంగా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ.. రూపొందించిన కొన్ని సినిమాలు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి క్రమంలో తారక్‌.. వెట్రిమోరన్‌పై అభిమానంతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే తారక్ ఫ్యాన్స్ మాత్రం ఆ డైరెక్ట‌ర్‌తో సినిమా వద్దంటే వద్దంటూ తారక్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటీవల వెట్రీమారన్‌ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన బ్యాడ్ గర్ల్ సినిమా టీజర్ రిలీజ్ అయి విపరీతమైన విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తారక్ ఫ్యాన్స్ నుంచి వెట్రిమారన్‌తో సినిమా వద్దంటు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

NTR 31: Jr NTR and Prashanth Neel film to have this delicate issue as  backdrop?

మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్‌ను తార‌క్ పట్టించుకుంటాడా లేదా.. ఆయన నిర్ణయం ఎలా ఉందో అన్ని సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలతో బిజీగా గ‌డుపుతున్నాడు. ఇలాంటి క్రమంలో 2026 నాటికి తారక్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ అంతకంతకు అద్భుతంగా డిజైన్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇలాంటి క్రమంలోనే టాప్ బ్యానర్లు తారక్ సినిమాలు రూపొందుతున్నాయి. ఇక తారక్ కేవలం సౌత్‌లోనే కాకుండా.. నార్త్‌లోను తన సత్తా చాటుకుని.. అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వార్ 2 సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు తారక్.