షూట్‌లో మహేష్ ఆ స్టార్ హీరోయిన్‌ను అంతలా ఏడిపించాడా.. షాకింగ్ సెక్రెట్ రివిల్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఐదు పదుల వయసులోను యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న మహేష్.. దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అయితే ఈయన తన సినీ కెరీర్‌లో ఎంతోమంది సీనియర్ హీరోయిన్‌ల‌ దగ్గర నుంచి.. ఇప్పుడు వస్తున్న యంగ్‌ హీరోల వరకు దాదాపు చాలామందితో చిందేసారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సినిమాలో నటించే హీరోయిన్లతో ఎంతో జోయల్‌గా ఉంటూ.. వారిని ఆట పట్టిస్తూ ఉంటాడట. పైకి సైలెంట్ గా, అమాయకంగా కనిపించే మహేష్.. చాలా తుంటరివాడని.. హీరోయిన్లను ఆటపట్టించే సీన్స్ ఉంటే మరింతగా వారిని ఏడిపిస్తాడంటూ ఓ సీనియర్ లేడీ ఆర్టిస్ట్ ఇటీవల ఓ సందర్భంలో వివరించింది.

19 Years for Classic Murari: Check out why the Mahesh Babu starrer was  loved by audience?

ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైర‌ల్ అవ్వ‌డంతో అంతా షాక్ అవుతున్నారు. ఇక మహేష్ బాబు, సోనాలిబింద్రె జంటగా మురారి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ మరదలు సోనాలిని ఏడిపించే అల్లరి కుర్రాడిగా కనిపిస్తాడు. అయితే.. మహేష్ తో సోనాలి చాలా కలుపుగోలుగా ఉండేదని.. దాంతో డైరెక్టర్ చెప్పిన దానికంటే ఎక్కువగానే సోనాలిని మహేష్ ఆటపట్టించేవారని ఆమె వెల్లడించింది. ఇంతకీ ఆ సీనియర్ బ్యూటీ ఎవరో కాదు.. సినిమాలో మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నా సుధా. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది.

That's Why I rejected Srimanthudu!

కొన్ని సీన్స్‌లో అయితే మహేష్ బాబు ఆట పట్టించిన తీరుకు సోనాలి ఏడ్చేసినంత పనిచేసేదట. ఇక ఆ షాట్‌ పూర్తయిన తర్వాత.. సోనాలి వచ్చి మీరు కావాలని నన్ను అంతలా ఏడిపిస్తున్నారు కదా అని అడిగేదట. దాంతో మహేష్, సుధా కలిసి నవ్వుకునే వారిని.. అలా సరదాగా హీరోయిన్లకు కూడా ఉత్సాహం కల్పించి.. సెట్ అంతా సందడిగా ఉండేలా మహేష్ బాబు చూసుకుంటారని సుధ వెల్లడించింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్స్‌లో మహేష్ త్వరలోనే సందడి చేయనున్నాడని తెలుస్తుంది.