వాడు నా బెస్ట్ ఫ్రెండ్.. కానీ నేను అవకాశాలు ఇవ్వలేదు.. స్టార్ కమెడియన్ పై అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్..!

ప్రస్తుతం టాలీవుడ్ అంతా పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం పాన్ ఇండియా సినిమాలకు దూరంగా ఉంటూ ఇండియావ్యాప్తంగా తెలుగు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతున్న అనిల్.. తను నమ్ముకున్న కథతో లోకల్‌గానే ఓ రేంజ్‌లో సక్సెస్ అందుకుంటూ రాణిస్తున్నాడు. ఇక రీసెంట్గా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.

His Sacrifice Presented A Star Comedian | cinejosh.com

వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే జనం థియేటర్ల వద్దకు క్యూ కట్టారు. ఇప్పటికీ సినిమా హౌస్ ఫుల్ తో కలకలాడుతుంది అంటే ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక పటాస్ సినిమాతో ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా మారిన అనిల్ దాదాపు తన పదేళ్ల సినీ కెరీర్‌ని పూర్తిచేసుకున్నాడు. ఈ పదేళ్ళ‌లో 8 సినిమాలను తెర‌కెక్కించి ప్రతి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. అనిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Anil Ravipudi: మా అమ్మ 30 ఏళ్ల తర్వాత సినిమాకు వచ్చిందని ఫొటో పెట్టాడు, ఆ  హీరోనే దర్శకుడిగా నిలబెట్టారు: అనిల్ రావిపూడి-director anil ravipudi  completes 10 years film ...

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కమీడియన్‌ సప్తగిరి.. తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ వెల్లడించాడు. అంత బెస్ట్ ఫ్రెండ్ అయినా తన సినిమాల్లో అతనికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదో చెప్పుకొచ్చాడు. సప్తగిరికి ఫోన్ చేసి తన సినిమాలో ఒక్క సీన్, రెండు సీన్స్ అయితే నేను చేయనని అంటాడని.. సరే రా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ నీకు తగ్గది దొరికితే చేద్దాంలే అని నేను వివరించాను.. కానీ ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్ రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అదే వాడు ఒకటి, రెండు సీన్లు అయినా పర్లేదు నటిస్తానంటే వాడి కోసం ఓ మంచి కామెడీ సీన్స్ కచ్చితంగా చేసే వాడిన‌ని సరదాగా వెల్లడించాడు అనిల్. ఇక మేమిద్దరం అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా ఉన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అని.. మా ఇద్దరి మధ్యన ఇప్పటికీ అంతే మంచి ఫ్రెండ్‌షిప్ ఉందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనిల్ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారుతున్నాయి.